CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లెల్లో ఐదోవ విడత పల్లె ప్రగతి.

Share it:

 



మన్యం మనుగడ వాజేడు జూన్ 3:


తెలంగాణ రాష్ట్రం పల్లెల్లో ప్రగతి సాధించుట కొరకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ములుగు జిల్లా, వాజేడు మండలం లో జరిగిన ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత నాలుగు విడతలుగా గ్రామాలలో రోడ్లు, డ్రైనేజ్ ల నిర్వహణ, సీజనల్ వ్యాధులు, పారిశుధ్యం , ఘన వ్యర్థాల నిర్వహణ తెలంగాణకు హరితహారం కార్యకలాపాలపై ముందస్తు జాగ్రత్తలు అవసరం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు, తీసుకోవాలని, గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పల్లె ప్రగతి. ఈ కార్యక్రమం పల్లెల్లో అహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించిందిదంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యం. ఐదో విడత పల్లె ప్రగతిలో భాగంగా తొలి రోజు గ్రామసభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళికను తయారుచేయాల్సి ఉంటుంది. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, నాలుగు విడతల్లో సాధించిన ఫలితాలను నివేదిక రూపంలో గ్రామసభ ఎదుట చదివి వినిపించాలి. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, తహసిల్దార్, లక్ష్మణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: