CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామాల అభివృద్దే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా.అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:


మన్యం టీవీ భుర్గంపాడు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లోని ఇర వెండి గ్రామంలో 10 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో 2 సిసి రోడ్లకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన తోపాటు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల సర్వతో ముఖ అభివృద్ధికి పాటు పడుతుందని,సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలలో అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయి అన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని ఆయన అన్నారు.మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.రైతుల కోసం దేశం లో ఎక్కడ లేని విధంగా రైతుబంధు,రైతు భీమ,లాంటి పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అన్ని రంగాలకూ 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంకు దక్కుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస రావు,వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి,స్థానిక ఎంపీటీసీలు,సర్పంచులు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, టిఆర్ఎస్ పార్టీ సారపాక టౌన్ అధ్యక్షులు కొనకంచి. శ్రీనివాసరావు,స్థానిక టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,మహిళా కార్యకర్తలు,అభిమానులు,పార్టీ సీనియర్ నాయకులు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: