CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ గూడెలలో( విజ్జు) భూమి పండుగ ప్రారంభం.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏటూరు నాగారం ఐటిడిఎ పేసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్.

Share it:



మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఆదివాసీలు అత్యంత ప్రీతి ప్రేమగా తరతరాలుగా ప్రకృతి ఒడిలో మమేకమై సంస్కృతి సంప్రదాయాలతో ఆదివాసీలు మొదటగా (విజ్జు) భూమి పండుగతో వారి జీవన ప్రయాణం మొదలవుతుంది. దీనిలో భాగంగా తాడ్వాయి మండలంలోని జలగ లంచ గ్రామంలో బుధవారం ఆదివాసి పెద్దలు తెగల ఆచారాల సంప్రదాయాలతో విజ్జు భూమి పండుగ నిర్వహించుకోవడం జరిగింది.గ్రామ పెద్ద కురసం జోగయ్య ఆహ్వానం మేరకు ఏటూరు నాగారం ఐటిడిఎ పేసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ.జూన్ మాసంలో మొదలయ్యే విజ్జు భూమి పండుగకు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తెగల పెద్దలు గ్రామ పొలిమేరలో ఉన్న ఇప్ప చెట్టు వద్ద ఇష్ట దేవతల కు వడ్లు, ఇప్ప సారా ను ఆరబోసి మేక, కోడిని బలి ఇస్తారని అన్నారు. గ్రామంలో ఉన్న అటువంటి ప్రతి ఇంటి నుండి బియ్యం, ఉప్పు,కారం,పసుపు సేకరించి వంట చేసుకుని వారు తెచ్చిన ఇప్ప సారా ను ఇప్ప ఆకులను దోప్పలుగా చేసుకుని సారా ను సేవించి సహా పంక్తి భోజనం చేస్తారని అన్నారు.ఇలాంటి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆదివాసి కుల పెద్దలు, యువతీ,యువకులపై ఉందని ఈ సందర్భంగా పేసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ అన్నారు.ఈ ఆదివాసి సంస్కృతి సంప్రదాయ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు దబ్బ గట్ల సుమన్, గ్రామస్తులు మడవి రాము,ఎట్టి రమేష్,బీమా, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: