CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు విలేకరులతో ఆయన మాట్లాడారు...


👉 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...


👉 నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు...


👉 గతంలో ఏ ప్రభుత్వాలు చేయని సంక్షేమాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందఅన్నారు...


👉 టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేడు గడపగడపకు అందుతున్నాయని పేర్కొన్నారు, దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకాని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో అమలువుతున్నాయి అన్నారు...


👉 తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు, సీఎం కేసీఆర్ గారు నిత్యం పేద ప్రజల, రైతుల, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటు పడుతున్నారని అన్నారు...


👉 టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాలు, రూపురేఖలు మారిపోయాయని, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిదన్నారు...


👉 మిషన్ భగీరథ ,కేసీఆర్ కిట్లు, గర్భిణీలకు, బాలింతలకు, బీడీ కార్మికులకు, ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు...


👉 ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాల వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు, ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లాలి ప్రజలకు వివరించాలని కోరారు...


👉 పార్టీ బలోపేతానికి నాయకులు కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు, తప్పకుండా మళ్లీ మన ప్రభుత్వం వచ్చే విధంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు...


👉 ఇంత చేస్తున్న కొందరు ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో ఉన్నారని విమర్శించారు...


👉 నియోజకవర్గాల వారీగా పర్యటిస్తామని, అన్ని పార్టీ కమిటీలతో సమీక్షలు నిర్వహిస్తామన్నారు...


👉 తర్వాత మండలాల వారీగా వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన తెలిపారు...


👉 రాబోయే ఎన్నికలలో నాటికి జిల్లాలో పార్టీ తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతా మన్నారు, అనుబంధ సంఘాలను కూడా బలోపేతం చేస్తామని, ఎవరిని విస్మరించ బొమ్మని ఆయన స్పష్టం చేశారు...


👉 ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వర్లు గారు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ దిండిగాల రాజేందర్ గారు, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కాపు సీతామాలక్ష్మి గారు, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ భానోత్ హరి సింగ్ నాయక్ గారు, మణుగూరు జడ్పిటిసి శ్రీ పోశం నరసింహారావు గారు, ఇల్లందు జడ్పిటిసి శ్రీమతి వాంకుడోత్ ఉమా దేవి గారు, జూలూరుపాడు జడ్పిటిసి శ్రీమతి కళావతి గారు,TRSV రాష్ట్ర కార్యదర్శి శ్రీ NN రాజు గారు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: