CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పది పరీక్షల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు..88% ఉత్తీర్ణతతో కస్తూర్బా బాలికల పాఠశాల

Share it:

 


జూలూరుపాడు జూన్ 30, (మన్యం మనుగడ) ప్రతినిధి, పది పరీక్షల ఫలితాల్లో జూలూరుపాడు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. 9.5 జీపీఏ తో పాపకొల్లు ఉన్నత పాఠశాల విద్యార్థిని బాణాల ఉమాశ్రీ మండల వ్యాప్తంగా ప్రథమ స్థానం పొందింది. 9.2 జిపిఏ తో పడమట నర్సాపురం ఎస్ వి కే ఎం ఉన్నత పాఠశాల విద్యార్థులు బోడ స్నేహ, భూక్య సింధు లు నిలిచారు. మండల వ్యాప్తంగా 336 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 82% తో 276 మంది ఉత్తీర్ణులయ్యారు. కస్తూరిబా బాలికల పాఠశాలలో 42 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 88% తో 37 మంది, పడమట నర్సాపురం పాఠశాలలో 51 మందికి గాను 44 మంది, కాకర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 44 మందికి గాను 37 మంది, పాపకొల్లు ఉన్నత పాఠశాలలో 44 మందికి గాను 36 మంది, నర్సాపురం బాలికల ఆశ్రమ పాఠశాలలో 105 మందికి గాను 85 మంది, జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 37 మందికి గాను 29 మంది, కొండెపుడి ఉన్నత పాఠశాలలో 13 మందికి గాను 8 మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా మండలంలోని రెండు ప్రైవేటు పాఠశాలలలో 28 మంది పరీక్షలు వ్రాయగా 27 మంది ఉత్తీర్ణులయ్యారు. మండలంలో ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్, పాఠశాలల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Share it:

TS

Post A Comment: