CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించిన అధికారులు.. మండలంలోని పల్లె ప్రగతి 7 రోజు అభివృద్ధి పనులు..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగుడెం ::

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమాన్ని దుమ్ముగూడెం మండల అధికారులు ఛత్తీస్ ఘడ్ సరిహద్దు గ్రామాల్లో గురువారం నిర్వహించారు. మండల పరిధిలోని పైడి గూడెం, సుజ్ఞానపురం, చింతకుప్ప రాజు గుంపు, ఆదర్శనగర్, గౌరవరం తదితర గ్రామాల్లో పర్యటించి బడిబాట కార్యక్రమం పై తల్లిదండ్రులకు గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపిపి రేసు లక్ష్మి, జడ్పిటిసి తెల్లం సీతమ్మ లు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలను కల్పించిందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు . సుజ్ఞానపురంలో ఏడుగురు పైడిగూడెంలో ఎనిమిది మంది విద్యార్థులను అంగన్వాడి కేంద్రం నుండి ఒకటవ తరగతిలో పేర్లు నమోదు చేయించారు. సుజ్ఞానాపురం గ్రామంలో మండల పరిషత్ నిధులతో 5 లక్షల సి సి రోడ్డు నిర్మాణం శంకుస్థాపన, గౌరారం పంచాయతీ తాటి వారి గూడెం గ్రామంలో త్రి ఫేస్ కరెంటు సదుపాయం కొరకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు సమస్యను గుర్తించి కరెంట్ డిపార్ట్మెంట్ వారికి సిఫార్సు చేసిన అధికారులు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రమౌళి, ఎం పి ఓ ముత్యాలరావు, రిసోర్స్ పర్సన్ ప్రభాకర్ ,సర్పంచులు, సోడి జ్యోతి, కట్టం కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కణితి రాముడు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: