CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు సమక్షంలో మన ఊరు మన బడి కి ఎన్ఆర్ఐ 25 లక్షలు విరాళం ప్రకటించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షులు ,ఎన్నారై ప్రతినిధి తాళ్లూరి జయ శేఖర్

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు శుక్రవారం నాడు తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళ్లూరి భారతి దేవి జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు తాళ్లూరి జయ శేఖర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమానికి పాఠశాల అభివృద్ధి కోసం 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు...


👉 ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రే కాంత రావు గారు మాట్లాడుతూ

 

👉 సీఎం కేసీఆర్ గారి మార్గదర్శనం నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అద్భుతమైన ప్రగతి సాధిస్తూ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు, విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు , ప్రాథమిక పాఠశాల నుంచి మహిళలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీల వరకు వందల విద్యాసంస్థలు నెలకొల్పమని లక్షల మంది విద్యార్థులకు అత్యుత్తమ సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామని వాటి ఫలితాలు అందుతున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారు ప్రస్తావించారు, సర్కార్ స్కూళ్లను సైతం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మన ఊరు మన బడి పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు అన్నారు, రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధి చెందిన తెలంగాణ బిడ్డల భాగస్వామ్యాన్ని ఈ విషయంలో కోరినట్లు తెలిపారు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ముందుకు కోస్తే తరగతి గదులు బడులకు దాతల పేర్లు పెట్టేఅందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని అని అన్నారు, సంపూర్ణ సహకారం అందిస్తాం ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమానికి తోడ్పాటు అందించేందుకు విదేశాలలో స్థిరపడిన ఎన్నారైలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు, తమ గ్రామాలు లేదా తాము ఏoచుకునే ఇతర ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు వాటి అభివృద్ధికి ముందుకొచ్చి ఎన్ఆర్ఐలకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు...


👉 ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మాజీ అధ్యక్షుడు ఎన్నారై ప్రతినిధి తాళ్లూరి జయ శేఖర్ గారు మాట్లాడుతూ 


👉 సీఎం కేసీఆర్ గారి నిర్ణయం చారిత్రాత్మకం


👉 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించిన తెరాస ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారు స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనను ప్రవేశ పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని చరిత్రలో నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు, ఫీజులను నియంత్రణ తో పాటు సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం ద్వారా పేద ప్రజలకు సామాన్య మధ్య తరగతి పిల్లలకు విద్యను మరింత చెరువ చేసినట్లవుతుందని మన ఊరు మన బడి అనేది కెసిఆర్ గారు ఆలోచనకు గొప్ప దన్నారు, అలాగే చిన్నప్పట్నుంచి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం కేసీఆర్ గారి చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు...


👉 ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల ZPTC కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్క సాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,TRSV రాష్ట్ర కార్యదర్శి NN రాజు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కామిరెడ్డి రామ కొండారెడ్డి, కోలేటి భవాని శంకర్, మాజీ ఎంపిటిసి వల్లూరిపల్లి వంశీకృష్ణ, వట్టం రాంబాబు, తాతా రమణ, కొండేరు రాము, మండల యూత్ అధ్యక్షులు గోనెల నాని, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పెద్ద వీర్రాజు, మణుగూరు మండలం సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, స్థానిక సర్పంచ్ లు సూరమ్మ, లక్ష్మి, యూత్ నాయకులు తోకల సతీష్, మిట్ట కంటి సురేందర్ రెడ్డి,సిలివేరు వెంకటేష్, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: