CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పత్రికాప్రకటన 21-6-2022 పాల్వంచ.కుంజం బద్రు అక్రమ అరెస్టును ఖండించండి

Share it:

 

                          

  • ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాలి
  •  సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ
  •  భద్రాచలం డివిజన్ కార్యదర్శి
  •  మోరా రవి


బూర్గంపాడు మండలం, రాజీవ్ నగర్ గ్రామానికి చెందిన అఖిల భారత రైతుకూలీ సంఘం మండల నాయకులు కామ్రేడ్ కుంజం బద్రు ఇంట్లో అర్ధరాత్రి సాయుధులైన  పోలీసులు చొరబడి భయబ్రాంతులకు గురి చేస్తూ, సోదాలు చేసి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి మోరా రవి ఖండించారు. మంగళవారం పాల్వంచ లో జరిగిన న్యూడెమోక్రసీ కార్యకర్తల అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ కుంజం భద్రు వ్యవసాయ కుటుంబం కి చెందినవాడు. తాను వ్యవసాయం చేసుకుంటూ మా పార్టీ కార్యక్రమంలలో  పాల్గొంటూ ఇక్కడా జీవిస్తున్నాడాని అలాంటి ప్రజా ఉద్యమ నాయకులను అరెస్టు చేశారని దీన్ని ఖండిస్తున్నాము.

గత రాత్రి 11:30 గంటల సమయంలో రెండు వాహనాల్లో వచ్చిన పోలీసులు పాల్వంచ మండలం నర్సంపేట వద్ద రోడ్లపై వాహనాలు నిలిపివేసి, నడుచుకుంటూ రాజీవ్ నగర్ చేరుకొని, 12 గంటల సమయంలో లో కుటుంబ సభ్యులు అందరూ నిద్రలో ఉండగా, ఇంట్లో చొరబడి సోదాలు చేసి, నిద్రలో ఉన్న భద్రుని  లేపి ఫాంట్ షర్ట్ వేసుకోమని చెప్పి, ఇక్కడదాకా మాతో రమ్మని తీసుకెళ్లి ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అతను చేసిన నేరం ఏమిటి? అనే విషయం చెప్పకుండా రహస్యంగా తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని తీసుకెళ్లినట్టుతీసుకెళ్లినట్టు, తను ఒక సాధారణ రైతు మాత్రమే అనే విషయాన్ని పరిగణించకుండా,  అర్ధరాత్రి తీసుకెళ్లడం సరైంది కాదన్నారు. తను చేసిన నేరం ఏదైనా ఉంటే తెలియజేయాల్సింది పోయి ఇలా అర్ధరాత్రి తీసుకెళ్లడం ప్రజాస్వామ్య విరుద్ధమని తీవ్రంగా ఖండించారు. అతనిమీద ఏవైనా అభియోగాలు ఉంటే వెంటనే కోర్టులో హాజరు పర్చాలని , లేనియెడల బెషరతుగా విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.


*నా భర్త కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టండి*


    *బద్రు సహచరి అంజలి*


తన భర్త గత వారం రోజులుగా వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా అలసిపోయి నిద్రిస్తుండగా అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఇంట్లో సోదా చేసి వెంట తీసుకెళ్లారని, ఎందుకు తీసుకెళ్ళింది కూడా తెలియడం లేదని, తన భర్తకు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచిపెట్టాలని కోరుతుంది. సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు, అఖిలభారత రైతుకూలి సంఘం జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబు , వైయస్ రెడ్డి, ముత్యాల సత్యనారాయణ, వెంకటేశ్వర్లు , భీమయ్య , శ్రీకాంత్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: