CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జూలూరుపాడు లో ఘనంగా సిపిఐ 12వ మండల మహాసభ..

Share it:


మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 20, మండల కేంద్రంలోని ఎల్లంకి గార్డెన్ లో చింత స్వరాజ్యరావు, తూము కోటయ్య, సోబేన సూర్యం అధ్యక్షతన సీపీఐ 12వ మహాసభను సోమవారం ఘనంగా నిర్వహించారు. మహాసభ ప్రారంభం సందర్భంగా పార్టీ పతాకాన్ని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు ఆవిష్కరించారు. అనంతరం మండల మహా సభ ను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజా ఉద్యమాల ద్వారానే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, స్థానికంగా నెలకొన్న సమస్యలపై నిత్యం ప్రజలతో ఉండి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వైరా డివిజన్ కార్యదర్శి ఎర్ర బాబు సిపిఐ వైరా నియోజకవర్గ నాయకురాలు భానోత్ విజయ బాయ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, తెలంగాణ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చండ్ర నరేంద్ర కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ భాస్కర్ రావు, సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే నాగుల్ మీరా, జర్పుల ఉపేందర్, సీతారాంపురం ఎంపీటీసీ గోవింద్, సుజాతనగర్ మండల కార్యదర్శి భూక్య దసురు, కుమారి, హనుమంతరావు, ఎల్లంకి మధు, గుడిమెట్ల సీతయ్య, సిరిపురపువెంకటేశ్వర్లు, సామేలు, పొన్నికంటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: