CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం btps రైల్వేలైన్ రామానుజవరం నిర్వాసితులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలి! --:న్యూడెమోక్రసీ డిమాండ్

Share it:


 

భద్రాద్రికొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,  

భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ రైల్వే లైన్ నిర్వాసితులకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగ ఉపాధి కల్పించేదాకా రామానుజవరం ప్రజలకు అండగా నిలబడి న్యాయ పోరాటంతో పాటు, ప్రత్యక్ష ఆందోళన చేస్తామని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి స్పష్టం చేశారు. శుక్రవారం రామానుజవరం btps రైల్వే లైన్ నిర్వాసితులు ఏర్పాటుచేసిన సమావేశంలో మోరా రవి పాల్గొని మాట్లాడుతూ .. గత ఎన్నో సంవత్సరాల నుండి భూమినే నమ్ముకొని సాగు చేసి కుటుంబాలతో జీవనం సాగిస్తున్న రైతుల భూమిని రైల్వే లైన్ కొరకు, రైతుల, ఇతర స్థానిక ప్రజల నివాసాలు, నివాస స్థలాలు లాక్కొని అధికార యంత్రాంగం స్థానిక మధ్యవర్తుల ద్వారా ఎంతో కొంత ఇచ్చినంత ప్యాకేజ్ తీసుకొని తప్పుకోండి అని నచ్చచెబుతూ స్థానిక ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. btps కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వ అధికార యంత్రాంగం చట్టాలను పట్టించుకోకుండా, ల్యాండ్ ఎక్యూప్ మెంట్ చట్టం1994 గాని, 2013 భూసేకరణ చట్టాన్ని గాని, పరిగణలోకి తీసుకోకుండా కొంతమంది అధికారులు మధ్యవర్తుల ద్వారా స్థానిక ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. రామనుజవరం ప్రజల నిర్వాసిత సమస్యను తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రజల యొక్క వినతి మేరకు btps యాజమాన్యానికి, సంబంధిత అధికారులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుండి షోకాజ్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా కల్లబొల్లి మాటలుచెప్పి ప్రజలను మోసం చేయాలనుకున్న మధ్యవర్తులు, అధికారులు తప్పుడు పద్ధతుల్లో కాకుండా చట్టప్రకారం వ్యవహరించాలని వారి ఆలోచనా విధానం మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేవరకు, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు స్థానిక ప్రజల పక్షాన సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ వారికి అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. బి టి పి ఎస్ రైల్వ్ లైన్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని, సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పురం బిక్షం, మలికంటి రమేష్ , పెంట్యాల కృష్ణ , జూపల్లి ముత్తయ్య , సాధిని రాములు , పోలూరి గోపయ్య, దంతసరపు వీరన్న , దేశబోయిన సీతయ్య, పప్పుల రాంబాయమ్మ, పోతనబోయిన కోటయ్య, బొల్లంపెద్ద మదార్, తోటకూరి కోటయ్య , సిరికొండ మట్టయ్య , మలికంటి సైదులు, కృష్ణయ్య, నిమ్మనగోంటి నాగయ్య , పోలూరి రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: