CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఈ నెల 23న ప్రగతి భవన్ ముట్టడి ని జయప్రదం చేయండి.--:PYL - PDSU పిలుపు

Share it:


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికై ఈనెల 23న ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పీ వై ఎల్ నాయకులు మీడియం రాజు, వంకా సురేష్ , దుబ్బ వెంకటేష్ లు పిలుపునిచ్చారు. శుక్రవారం ములకలపల్లి మండలం గుట్ట గూడెం గ్రామంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించిన సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, నిబంధనలు పాటించని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ని రద్దు చేయాలని, ఫీజుల దోపిడీని అరికట్టాలని వారు అన్నారు. మన తెలంగాణ, మన రాష్ట్రం అంటూనే, ప్రత్యేక తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కూడా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయి, చదివిన చదువుకు విలువ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కని పెంచిన తల్లిదండ్రులకు కనీసం అన్నం పెట్టలేని పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఉన్నదని, ఉద్యోగాలు లేక పని లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటుందని వారు అన్నారు. నారాయణ, చైతన్య కాలేజీ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలతో సహా మన ఊరు మన బడి పథకాన్ని ప్రతి పాఠశాలకు వర్తింపజేయాలని వారు అన్నారు. టెట్ తేదీ పొడిగించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల కై ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 23న ఏపీ డీఎస్సీ పి ఓ ఎల్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా ప్రగతి భవన్ ముట్టడి ని విద్యార్థి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: