CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నర్సాపురం ప్రాధమిక పాఠశాల మరమ్మత్తులకు నిధులు మంజూరు..

Share it:మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 18 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని పడమట నర్సాపురం కాలనీ ప్రాధమిక పాఠశాలలో బుధవారం పాఠశాల పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శంకర్ రావు మాట్లాడుతూ.. పాఠశాలకు "మన ఊరు మన బడి" కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మేజర్ అండ్ మైనర్ రిపేర్ల కింద 5 లక్షల 12 వేల 68 రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ నిధులను పాఠశాల ప్రహరీ గోడ, గేటు విద్యుత్ మరమ్మత్తులు పాఠశాల గదులకు రంగులు వేయడానికి ఉపయోగించాల్సి ఉందని అన్నారు. అతి త్వరలో ఈ పనులను మొదలుపెడతామని తెలిపారు. అదేవిధంగా పాఠశాల తరగతి గదులలో ఒక గది ఉపయోగానికి వీలులేకుండా దెబ్బతిన్న నందున నూతన తరగతి గది నిర్మాణానికి పాఠశాల విద్యా కమిటీ తరఫున ప్రపోజల్స్ పంపుతామని తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల చైర్మన్ బిక్షపతి, ఉప సర్పంచ్ రవి, వార్డు మెంబర్ కాజా రమేష్, పాఠశాల పాలకవర్గ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: