CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వ్యవసాయ రంగంలో చిన్నపాటి మెలకువలతో అధిక దిగుబడులు పొందవచ్చు -ఎమ్మెల్యే మెచ్చా.పాల్గొన్న ఎంపిడివో, సొసైటీ ఛైర్మెన్ నడిపల్లి సునంద, సొసైటీ డైరెక్టర్లు

Share it:


ములకలపల్లి:మే 28:మన్యంమనుగడ ప్రతినిధి: ములకలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు పచ్చిరొట్ట అయిన జీలుగులు,జనుము విత్తనాలను రైతులకు ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు నడిపల్లి సునంద అధ్యక్షతన ముఖ్య అతిథిగా విచ్చేసిన అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు జీలుగు,జనుము విత్తనాలు సబ్సిడీ పై అందుబాటులో ఉన్నాయని,రైతులు వాటిని సద్వినియోగ పరుచుకోగలరని కోరారు.పచ్చిరొట్టె సాగు చేసి పూత దశలో ఉన్నప్పుడు భూమిలో కలియ దున్నడం వల్ల భూమిలోని భూసారం పెరగడమే కాకుండా భూమికి నీటిని నిలువ చేసే సామర్థ్యం పెరుగుతుందని తద్వారా రైతులు అధిక దిగుబడులను పొందావచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి కరుణామయి, ఎంపిడివో చిన నాగేశ్వరరావు,ఎంపిపి మట్ల నాగమణి, వైస్ ఎంపీపీ కొదుమురి పుల్లారావు,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగళ్ళ వెంకటేశ్వరరావు,ములకలపల్లి టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మోరంపుడి అప్పరావు,ములకలపల్లి గ్రామ పంచాయతి ఉపసర్పంచ్ శనగపాటి అంజి, mpdo,పోగల్లపల్లి సర్పంచ్ వగ్గెల రమణ,సంఘ డైెరెక్టర్లు వుకంటి రవి,చిట్టిబాబు,గంగావరపు సుధాకర్, టీఆర్ ఎస్ పార్టీ నాయకులు పువ్వల మంగపతి, మాజీ సొసైటీ అధ్యక్షులు కరుటురి కృష్ణ,శనగపాటి రవి, పువ్వుల చందర్ రావుకొండవీటి రాజారావు సంఘం సీ ఈ ఓ మురళి సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: