CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎడ్జర్లపల్లి, ఇసుక క్వారీలలో హద్దులు దాటి ఇసుక తవ్వకాలు.ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్

Share it:

 


  • ఇసుక క్వారీ పై పర్యవేక్షణ చేయవలసిన అధికారులు జాడే లేదు.
  • పెసా చట్టని ఉల్లంఘన చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి.
  • టి యస్ యం డి సి, హద్దులు దాటిన ఇసుక క్వారీ పై చర్యలు తీసుకోవాలి.
  • రేజింగ్ కాంట్రాక్టర్ల విధానాన్ని పూర్తిగా రద్దు.
  • లారీలలో ఇసుక పరిమితికి మించి.
  • భారీ యంత్రాలతో తవ్వకాలు.

మన్యం మనుగడ/వాజేడు: 



ములుగు జిల్లా వాజేడు మండలం ఎడ్జర్లపల్లి, గ్రామ పంచాయతీ ఇసుక క్వారీ లో హద్దులు దాటి ప్రభుత్వ నిబంధనలు పాటించని రేసింగ్ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వాజేడు మండలం తాహాసిల్దార్ సర్వర్ పాషా వినతి పత్రం అందజేశారు. ఈ ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు పూనేం రామచంద్రరావు. మాట్లాడుతూ

ప్రభుత్వ ఇసుక రీచ్‌ల వద్ద రోజుకు లక్షల రూపాయల ఇసుక అక్రమంగా తరలి వెళ్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. 

 అక్రమ రవాణాను నిరోధించాల్సిన సంబంధిత అధికారులు నిద్రావస్థలో ఉంటున్నారనే ప్రజల వాదనను కొట్టివేయలేని పరిస్థితి. ఇసుక లారీలు సామర్థ్యానికి మించి వెళ్తున్నా.. పట్టించుకునే నాధుడు లేడు. తనఖీలు చేయాల్సిన మైనింగ్, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నామమాత్రం తనిఖీల తోనే సరిపెడుతున్నారని ఆయన అన్నారు. సొసైటీ, నుంచి పట్టా క్వారీల వరకు అక్రమ రవాణాకు ఆజ్యం పోస్తోంది. ఇదిలా ఉండగా ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన అధికారుల నిత్య పర్యవేక్షణలో ఇసుక క్వారీ కొనసాగాల్సి ఉండగా ప్రస్తుతం సంబంధిత ప్రాజెక్టు అధికారి కొసమెరుపుగా దాడులు నిర్వహిస్తున్నారని.రేసింగ్ కాంట్రాక్టర్లు మాత్రం అడ్డులేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 



ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సొసైటీ, పట్టా ఇసుక రీచ్ లను,ఆదివాసీలను అభివృద్ధి చేయడం ఎంతైనా అవసరం, ఇసుక రీచ్ లను, ఆదివాసీలను ఆసరాగా చేసుకుని గుత్తేదారులు నిబంధనలను తుంగలో తొక్కి ఇసుక దందాను యదేచ్ఛగా నడిపిస్తున్నారు.క్వారీలలో రేజింగ్ కాంట్రాక్టర్ల ఆధిపత్యాన్ని పూర్తిగా రద్దు పర్చాలని, ఎడ్జపల్లి పట్టా ఇసుక క్వారీ రేజింగ్ కాంట్రాక్టర్, టి ఎస్ ఎం డి సి ,పరిధిలో ఇసుకను తీయకుండా చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి,గోదావరి మధ్యలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.ఇట్టి పట్టా క్వారీపై సర్వే నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే మండల కేంద్రంలోని పలు గ్రామ పంచాయతీలలో నిర్వహించే సొసైటీ ఇసుక క్వారీల వద్ద పరిమితులను మించి రాత్రి వేళలో సమయపాలన పాటించకుంట క్వారీ నిర్వాహకులు రాత్రి పగలు తేడా లేకుండా బారి యంత్రాలతో ఇసుక డంపింగ్ చేస్తున్నారు. బకెట్ల దందాను నిర్మూలించాలని, ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి క్వారీలపై విచారణ జరిపించాలని, లేదంటే ప్రజలతో మరొక ఉద్యమానికి శ్రీకారం చేపడతామని ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సమ్మయ్య,అనిల్, తాటి లక్ష్మణ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: