CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజా సేవే పరమావధి గా తలచి ప్రజా సేవలో తరిస్తున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్.

Share it:

 


మన్యం మనుగడ,మంగపేట.

మంగపేట మండలం లోని లక్ష్మి నర్సాపురం -రాజుపేట శ్రీ నాగులమ్మ ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో స్థాపించ బడిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ తమ సేవా కార్యక్రమాలు విస్తృత పరచి ఆపదలో ఉన్న వారికి మేము ఉన్నాం అంటూ వారికి తోడుగా, ఆర్ధిక చేయూత, నిత్య అవసర సరుకులు, ప్రమాదం లో ఉన్నవారికి, వృద్ధులకు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఒకవైపు మాధవ సేవ, మరొక వైపు మానవ సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం.మంగపేట మండలం దోమెడ గ్రామపంచాయతీ పరిధిలోగల లొడు గూడెం చెరువు వద్ద ఉపాధి హామీ కూలీలు గా పనిచేస్తున్న వారి వద్దకు వెళ్లి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు వందమందికి చల్లటి మజ్జిగ ను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఉంటుందని తెలిపారు ప్రజా సేవే మాకు పరమావధి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమెడ గ్రామస్తులు కొమరం లక్ష్మయ్య, పూనెం రమేష్ , దబ్బగట్ల మల్లయ్య, బోడ ముత్తయ్య, యమ్.డి.ఖాజా పాషా, కోరం కనకయ్య, మేకల ప్రదీప్ ,జాడి.మల్లక్క, పోదెం రామ్మూర్తి ,

జాడి.నరేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 

రామచంద్రునిపేట గ్రామపంచాయతీ పరిధిలోగల

 కొత్త.ఉప్పల్ రెడ్డి- సుభద్ర కుటుంబం ఆర్థికంగా చాలా దీన స్థితిలో ఉంది. వారిరువురి ఆరోగ్యం కూడా బాగోలేక పోవడంతో వారి కుటుంబాన్ని కలిసి 2000/- ఆర్థిక సాయాన్ని శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ సభ్యులు అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాడిశ నాగ రమేష్, నవీన్, ఇర్ప.నాగ శ్రావణ్ , కొమరం నితిన్, మడకం సుప్రజ ,చౌలం.భవాని, మానవ సేవ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు జై భీమ్ రామ్మోహన్ మరియు రామచంద్రుని పేట చెందిన యాదగిరి మరియు మహిళలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: