CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మావోయిస్టు మిలీషియా కమాండర్ అరెస్ట్.వివరాలు వెల్లడిస్తున్న భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ శబరిష్...

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం:

దుమ్ముగూడెం మండలంలోని చింతగుప్ప గ్రామసమీపంలో అటవీప్రాంతంలో దుమ్ముగూడెం పోలీస్ , సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ జి కంపెనీ సిబ్బందితో కలిసి ఉదయం 7 గంటల సమయంలో కుబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అతని వెంబడించి పట్టుకొని ప్రశ్నించగా అతను సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా డిప్యూటీ కమాండర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. అతని పేరు మాడివి నంద s/o పొజ్జ ,వయసు 33 తుమ్మరిపాడు గ్రామం,కిష్టరం మండలం , గత కొన్ని సంవత్సరాలుగా అతను మావోయిస్టు పార్టీకి పనిచేస్తున్నట్టు తెలిపాడు తను సంఘటనలు లో పాల్గొన్న టు కేసులు ఉన్నాయి 1. గత నెల దుమ్ముగూడెం మండలం చింతగుప్ప గ్రామంలో రోడ్డు పనుల వంతెన నిర్మాణంలో ఉన్న వాహనాలు తగలబెట్టిన సంఘటనలో పాల్గొన్నడు.2. కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలో పోలీస్ ల పై దాడి చేసి ఒక పోలీస్ చంపిన సంఘటనలు లో పాల్గొన్నాడు 3. మొన్న పోతనపల్లి పోలీస్ బేస్ క్యాంప్ పై దాడి చేసిన సంఘటనలో పాల్గొన్నాడు . ఇతని వద్ద నుంచి బార్మర్ తుపాకీ తో పాటు 50 గ్రాములు గన్ పౌడర్ ను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదుచేసి జుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచారు ఈ సందర్భంగా భద్రాచలం ఏఎస్పి డాక్టర్ శబరిష్ మాట్లాడుతూ ఆదివాసీ గ్రామంలో రోడ్డు స్కూలు హాస్పటల్ నిర్మాణం జరిగితే అభివృద్ధి చెందితే ప్రజలు ఎవరూ కూడా మార్చే పార్టీకి సహకరించాలని అందువల్ల ఆదివాసి అభివృద్ధి పార్టీ అడ్డుకుంటుందని అలానే అమాయక ఆదివాసి ప్రజల నుండి బలవంతంగా డబ్బులు, బియ్యం మొదలగు ఏళ్తున్నారని, ఆదివాసీ యువతను తన పార్టీలో బలవంతంగా చేర్చుకొని డబ్బులు వసూలు చేయడానికి అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారని కావున పోలీసు వారు విజ్ఞప్తి ఏమనగా నిషేధిత సీపీఐ పార్టీకి మద్దతు ఇవ్వవద్దని ముఖ్యంగా యువత మావోయిస్టు మార్గాన్ని ఎంచుకోవడం సరైనది కాదని ఎవరైనా బలవంతంగా లేదా మరేదైనా కారణాలతో ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో చేరిన అయితే పోలీసులు ముందు లొంగి పోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లో దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్, సిఆర్పిఎఫ్ ఎస్ఐ సత్యనారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: