CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నక్సల్బరీ వసంత మేఘ గర్జన కు 55 యేండ్లు.ఈ నెల 25న ఖమ్మంలో ర్యాలీ -సదస్సును జయప్రదం చేయండి.

Share it:




  • సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి మోరా రవి 

మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 ఈ నెల 25న నక్సల్బరీ 55 వ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మం లో జరిగే ప్రదర్శన-సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి పిలుపునిచ్చారు. శుక్రవారం పాల్వంచ పట్టణం లోని బస్టాండ్ సెంటర్ లో నక్సల్బరీ పోరాటానికి 55 వసంతాలు నిండిన సందర్భంగా ఈ నెల 25న ఖమ్మంలో జరగనున్న ప్రదర్శన సభకు సంబంధించిన వాల్ పోస్టర్లు న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా *సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి* పాల్గొని మాట్లాడారు. నక్సల్బరీ పోరాటం దున్నే వాడికి భూమి నినాదంతో మొదలై భారతదేశంలో సకల దోపిడీీ, పీడనల నుండి విముక్తికై పీడిత ప్రజల ఉద్యమ గమనాన్ని నిర్దేశిస్తూ అసామాన్య త్యాగాలతో, ఎన్నో విజయాలను సాధించిందన్నారు. అదే విధంగా ఎన్నో ఆటుపోట్లకు, ఒడిదొడుకులకు గురైనప్పటికీ, పాలకవర్గాల దళారీ , నిరంకుశ, పాసిస్టు విధానాలను ఎండగడుతూ, రివిజనిజాన్ని, నయా రివిజనిజాన్ని ఓడిస్తూ, నక్సల్బరీ మొదలు, శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం, సిరిసిల్ల - జగిత్యాల రైతాంగ జైత్రయాత్ర, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల వరకు, నిత్యం నక్సల్బరి పోరాటం ప్రేరణగా నిలిచిందని గుర్తుచేశారు. అతివాద, మితవాద, పెడ ధోరణులకు గురైనప్పటికీ, ఎన్నో అనుభవాలు, గుణపాఠాలు తీసుకొని, భవిష్యత్తుకు భరోసా నిస్తూ, భారత విప్లవ పంథాగా కొనసాగుతుందని గుర్తు చేశారు. నక్సల్బరీ స్ఫూర్తితో భారతదేశ విముక్తికై పోరాడాలని పిలుపునిచ్చారు. నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమై 55 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఖమ్మంలో ఈనెల 25 న ప్రదర్శన భక్తరామదాసు కళాక్షేత్రంలో సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సులో *భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) ఆలిండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ PP అన్న, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు అన్న, అరుణోదయ రాష్ట్ర అద్యక్షుడు పరకాల నాగన్న, అఖిలభారత రైతుకూలీ సంఘం(AIKMS) రాష్ట్ర అద్యక్షుడు వి.కోటేశ్వరరావుగారు ప్రగతిశీల మహిళా సంఘం(POW) రాష్ట్ర అద్యక్షురాలు ఝాన్సీ అక్క,సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, పి.విప్లవకుమార్* తదితరులు పాల్గొంటారని ప్రసంగిస్తారన్నారు. భారతదేశ విప్లవోద్యమం సాధించుకున్న విజయాలు,గుణపాఠాలు పరిశీలించుకోవాలన్నారు. చీలికలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వర్రావు, సంఘ వెంకటనరసయ్య మురారి నరసయ్య కిషన్, వాసు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: