CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇష్టపడి చదివితే విజయం మనదే:పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్ రాముడు.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


విద్యార్థిని విద్యార్థులు కష్టపడి కాదని,ఇష్టపడి చదివితే విజయం మనదేనని పీకే ఓసి ప్రాజెక్టు మేనేజర్ మాలోత్ రాముడు అన్నారు.భరోసా వెల్ఫేర్ సొసైటీ మణుగూరు వారి ఆధ్వర్యంలో సంతోష్ నగర్ బాల వెలుగు పాఠశాలలో నిర్వహించిన,గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు విద్యార్థుల మానసిక సంసిద్ధత అనే అంశంపై జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమీప గ్రామాలకు చెందిన బాల కార్మికులు,అనాధలు, అన్నార్తులను,చేరదీసి వారికి ప్రాథమిక విద్యను నేర్పించి, అనంతరం ప్రవేశ పరీక్షల ద్వారా గురుకుల పాఠశాలలో చేర్పించి,వారి పురోభివృద్ధికి పాటుపడుతున్న బాల వెలుగు నిర్వాహకులను ఆయన అభినందించారు.గత కొన్ని రోజులుగా భరోసా టీమ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్ని విధాలుగా తోడ్పాటును ఫ్యాన్లు,కూలర్, విద్యా సామాగ్రి అందించడంతో పాటు,విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు తట్టుకునే విధంగా ఫ్యాకల్టీ లతో కోచింగ్ ఇప్పించి, పరీక్షలకు అన్ని విధాలుగా వారిని మానసికంగా సిద్ధం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.సింగరేణి సేవా సమితి సభ్యులు ఆధ్వర్యంలో సేమ్యా విందు ఏర్పాటు చేయగా,భరోసా టీం ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు.అందరూ విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భరోసా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సలహాదారులు ఎం లింగబాబు,సభ్యులు వరుణ్, శ్వేతన్,రాజ్ కుమార్,ఎండి అమీనుద్దిన్,హ్యాండ్ రైటింగ్ హుస్సేన్,ఫ్యాకల్టీ వీరబాబు, శశి,స్వరూప రాణి,భరోసా టీం సభ్యులు జహీర్,రాజేష్,మీరా సాహెబ్,శేఖర్ బాబు,గఫూర్, హరీష్,సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా, జమీలా బేగం,మంగీలాల్, సాగర్,ముత్తమ్మ బాల వెలుగు నిర్వాహకులు జగన్మోహన్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: