CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ లో ముదురుతున్న వర్గ పోరు..

Share it:

 


  •  దైవ కార్యక్రమం నిర్వహణలో బయటపడ్డ విభేదాలు..

మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 25 మండల కేంద్రంలోనీ వెంగన్నపాలెం గ్రామంలో, దేవుడు కార్యక్రమాలకన్నా, ఎన్నికలన్నా, వర్గ పోరు బగ్గుమంటుంది. తెరాస నేతల మధ్య వున్న వర్గ విబేదాలు రచకెక్కు తున్నాయి. పార్టీ నేతల్లో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుతుంది. మండల పరిధిలోని వెంగన్న పాలెం గ్రామంలో తెరాస పార్టీ నేతల మధ్య వర్గాపోరు బొగ్గు మంటోంది. మంగళవారం రాత్రి హనుమాన్ జయంతి వేడుకలు మేము నిర్వహింస్థామంటే, మేము నిర్వహిస్తామని, తెరాస, రెండు వర్గాల నాయకుల మధ్య గొడవలు జరిగాయి. గతంలోనూ కనకదుర్గమ్మ ఉత్సవ ఊరేగింపులో గొడవలు జరిగి కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇరువర్గాలను పోలీసులు లాఠిఛార్జ్ చేసి చెదరగొట్టారు. హనుమాన్ జయంతి సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, జిల్లా పోలీస్ ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు, జూలూరుపాడు సీఐ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. జూలూరుపాడు ఎస్ఐ పోటు గణేష్, సుజాతనగర్ ఎస్ఐ. తిరుపతిరావు, చంద్రుగొండ ఎస్ఐ విజయలక్ష్మి, అన్నపురెడ్డి పల్లి ఎస్ఐ. విజయ, వారి సిబ్బందితో పోలీస్ పహార నడుము భక్తులు ఆంజనేయున్ని దర్శించుకొని పూజలు నిర్వహించినారు. తెరాస నాయకుల ఆధ్వర్యంలో పోటాపోటీగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినారు. వెంగన్నపాలెం గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తూ నిర్వహించినందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share it:

TS

Post A Comment: