CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలు.

Share it:

 


 మన్యం మనుగడ కరకగూడెం: కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని మేడే వేడుకలను మండలంలో సిపిఎం,సిఐటియు ఆధ్వర్యంలో పలు కేంద్రాలలో నిర్వహించారు.ఈ సందర్భంగా మేడే కార్యక్రమాల్లో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు మాట్లాడుతూ కార్మికవర్గ సమస్యల పరిష్కారానికి పోరాటాలు మార్గమని సమస్యల పరిష్కారానికి హక్కుల సాధనకు సమరశీల పోరాటాలు చేసేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు రోజురోజుకు మితిమీరుతున్న తరుణంలో సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని వారన్నారు. ప్రభుత్వ పథకాలలో కార్మికులకు ప్రాధాన్యం కల్పించాలని వారు కోరారు. అలాగె ప్రభుత్వం విధించే భారాలు మొదటగా కార్మిక వర్గాన్ని నష్టం చేకూరుతుందని వారన్నారు కార్మిక వర్గానికి పని ప్రదేశంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కనీస వేతన చట్టం అమలు చేయాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లో సిపిఎం మండల నాయకులు చర్ప సత్యం ఊకే నరసింహారావు బిలపాటి శంకరయ్య సిఐటియు నాయకులు ఇల్లందుల పిచ్చయ్య ధనంజయ్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: