CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.రూ.40 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన విప్ రేగా

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని అశోక్ నగర్,శ్రీ శ్రీ నగర్,శ్రీ సాయి నగర్ ల నందు మన ఊరు మనబడి కార్యక్రమం లో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలనందు మొత్తం రూ. 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల లను పునరుద్ధరించి, విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలనే సంకల్పం తో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా *మన ఊరు మన బడి* కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దీనిలో 12 అంశాలను చేర్చి పాఠశాలకు అవసరమైన పనులు,తరగతి గదుల నిర్మాణాలు మరుగుదొడ్లు, త్రాగునీరు,ఫర్నిచర్,కిచెన్ వంటి సదుపాయాలను,సమకూరుస్తున్నారు.పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు.పాఠశాలలకు విరాళాలు అందించడం ద్వారా ఎన్నో తరాలు ఉపయోగపడుతుందన్నారు.పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు మెరుగైన సౌకర్యాలు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి రెండు లక్షలు ఇస్తే,స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లో సభ్యుడిగా నమోదు చేసుకోవచ్చని,పది లక్షలు ఇస్తే తరగతి గది పేరు పేరు పెట్టడం జరుగుతున్నదని,కోటి రూపాయలు విరాళం ఇస్తే ఆ పాఠశాలకు వారి పేరును పెడతామన్నారు.ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మన ఊరు మన బడి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందన్నారు.విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందన్నారు. ప్రాథమిక పాఠశాలలో వసతుల కల్పన,అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని విప్ రేగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి,జడ్పీటీసీ పొశం.నరసింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రామిరెడ్డి,నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు, అభిమానులు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: