CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆడబిడ్డ పెండ్లికి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ భరోసా.కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:


మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని సమత్ భట్టుపల్లి రైతు వేదికలో 29 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద, మంజూరైన 29 లక్షల రూపాయల విలువ గల చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు పంపిణీ చేశారు. 

 ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.

అభివృద్ధి, సంక్షేమమె ధ్యేయంగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కెసిఆర్ పని చేస్తున్నారని అన్నారు.

 2014 ముందు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు ఒక లక్ష 116 రూపాయలను పేదప్రజలకు చెక్కు రూపంలో నేరుగా ఇస్తున్నామన్నారు.

ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పని చేస్తుందనిన్నారు.కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకం ఆడబిడ్డలకు ఒక భరోసాగా ఉందన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదన్నారు.భారతదేశంలో ఆడబిడ్డలకు పెళ్లిళ్లు కొరకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు.

అభివృద్ధి ,సంక్షేమ ద్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తాయని, కరోనా లాంటి సంక్షోభం లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.

అన్ని వర్గాల సంక్షేమ ద్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అద్భుతమైన పథకం ఉండటం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు.

నేటి పరిస్థితులలో ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కెసిఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోష దగ్గ విషయం అన్నారు.అలాగే రైతు బీమా కింద రూ.5 లక్షలు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. ఈ పథకాలు కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు కావడం లేదన్నారు.అయినా పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి నీతులు చెబుతున్నారు.

సమైక్య పాలనలో అన్నం కోసం తెలంగాణ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 1.8 నుంచి ఇప్పుడు 8.1 పెరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దారు ఉషా శారద, డిప్యూటీ తహశీల్దారు సంద్య, ఎంపీడిఓ శ్రీనివాస్,ఎంపీపీ రేగా కాళికా, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కుమరన్ రాంబాబు, ఎంపిటీసి ఎలిపెద్ది శైలజ సర్పంచ్ లు పాయం.నరసింహరావు, జవ్వాజి.రాధ,కుంజ వసంతరావు, కొమరం.విశ్వనాధం కరకగూడెం మండల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య వివిధ శాఖల అధికారులు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు , నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: