CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ పండుగలు వర్ధిల్లాలి. ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి... ఏఎస్పి

Share it:


మన్యం డెస్క్...

ఆదివాసీ సంస్కృతిక పండుగలకి ఆదివాసీల అస్తిత్వం అని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను అన్నారు. శుక్రవారం నాడు సంగమ్ పాడు ఆదివాసీ లు నిర్వహించిన భూమి పండుగ రేలా ఆటల్లో అయన పాల్గొని కాసేపు ఆదివాసీ లతో రేలా నృత్యం చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం మీద ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు విబిన్నమైనవి విలక్షణమైనవి. అవి నేటి ఆధునిక ప్రపంచం లో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది అన్నారు. ఆదివాసీల సంస్కృతి వాళ్ల అస్తిత్వం. అ అస్తిత్వం కోల్పోతే ఆదివాసీ లకు మనుగడే లేదు అన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ లు ఆదివాసీ సంస్కృతి క పండుగలు పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. చదువుల పేరుతో నేడు ఆదివాసీ సమాజం కూడా ఆదివాసీ పండుగలకు దూరం అవుతున్నారు. ఇతర మతాలు వాటి సాంసృతిక పండుగలకు పట్యంశములో లో పొందు పరిచినట్టు ఆదివాసీ సాంసృతిక పండుగలని పాఠ్యముషం లో చేర్చాలని, ఆదివాసీ పండుగలుకు కూడా ప్రత్యేకంగా సెలవు దినాలు ప్రకటించాలని ప్రభుత్వాలను కోరారు. ఆదివాసీ లు అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వ పథకాలు తో పాటు వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు చట్టాలు కూడా అందుతూ వారి సంస్కృతి పరిరక్షణ చేసినప్పుడు మాత్రమే ఆదివాసీ లకు నిజమైన అభివృద్ధి సాధ్యం అవుతుంది అన్నారు.

Share it:

TS

Post A Comment: