CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శనగ కుంట అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచిన మణుగూరు ఏరియా సింగరేణి లేడీస్ క్లబ్ సభ్యులు.

Share it:

 



  • రూ.40 వేల రూపాయల నిత్యవసర వస్తువులు అందజేత:ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏరియా సేవా అధ్యక్షురాలు జక్కం వాణి,రమేష్


మన్యం టీవీ మణుగూరు:


గత నెల 25వ తేదీన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి సర్వం కోల్పోయి నిరాశ్రయులైన ములుగు జిల్లా మంగపేట మండలం శనగ కుంట గిరిజన గ్రామస్తులకు మణుగూరు ఏరియా సింగరేణి లేడీస్ క్లబ్ సీ టైప్ సభ్యులు రూ.40 వేల రూపాయల పైచిలుకు నిత్యవసర వస్తువులను ఏరియా సింగరేణి సేవా అధ్యక్షురాలు జక్కం.వాణి రమేష్ నేతృత్వంలో లేడీస్ క్లబ్ సభ్యులు బృందం గ్రామాన్ని సందర్శించి బాధితులకు నేరుగా నిత్యావసర వస్తువుల ప్యాక్ లను అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శనగ కుంట అగ్నిప్రమాద సంఘటన గురించి పత్రికల్లో సామాజిక మాధ్యమాల్లో చూసి క్లబ్ సభ్యులు స్పందించి తమకు తోచిన విధంగా బాధితులకు అండగా నిలబడటం అభినందనీయమని,కొనియాడారు.కొన్ని నిముషాల వ్యవధిలో శనగ కుంట ఊరు మొత్తం అగ్నికి ఆహుతి అవడం,గ్రామస్తులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిరాశ్రయులు కావటం, మండుటెండలో నడిరోడ్డుపై నిలబడటం బాధాకరమన్నారు. వారి కష్టాన్ని నేరుగా వారిని అడిగి తెలుసు కోవడం తో పాటు గ్రామంపై అగ్నిదేవుడు ప్రతాపం ప్రత్యక్షంగా చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా నిలబడాలని *శిశిరం అనంతరం వసంతంలా* మంచి గ్రామానికి రోజులు వస్తాయని బాధితులకు ఆమె కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. గ్రామం మొత్తం త్వరగా కోలుకోవాలని పిల్లల్ని బాగా చదివించాలని ఆమె గ్రామస్తులను కోరారు. మానవత్వం గుండె మంటలార్పుతుందని చెప్పడానికి శనగ కుంట అగ్ని ప్రమాద బాధితులకు అండగా పోలీసులు,స్వచ్ఛంద సంస్థలు, దాతలు మేమున్నామని నిలబడటం ఒక ఉదాహరణ అన్నారు.గ్రామం పునర్నిర్మాణానికి ప్రభుత్వం కూడా తమ వంతు సహకారం అందిస్తుందని,ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.లేడీస్ క్లబ్ మహిళా బృందం తమ గ్రామాన్ని సందర్శించి అండగా నిలబడటం పట్ల,కొండంత ధైర్యాన్ని ఇవ్వడం పట్ల మహిళలు గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ సమన్వయకర్త లేడీస్ క్లబ్ కార్యదర్శి అనితా లలిత్ కుమార్ మాట్లాడుతూ, శనగ కుంట అగ్ని ప్రమాద బాధితుల విషయం చెప్పిన వెంటనే అన్ని విధాలుగా సహకరించిన ఏరియా జిఎం జక్కం.రమేష్,వాణి రమేష్ దంపతులకు,సింగరేణి యాజమాన్యానికి ఆర్థికంగా సహకరించిన క్లబ్ సభ్యులు సుస్మిత ఫిట్జరాల్డ్,భాస్కరి రమణ,అనురాధ,వీరభద్రుడు,వాణి,శేషగిరిరావు,శారద,పి. ఆర్ కె రావు,అపర్ణ. మధుబాబు,సరిత శ్రీనివాస్ అందరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పుష్ప బాలరాజు,లక్ష్మి సుదర్శన్ రెడ్డి,లక్ష్మీ సాయినాథ్, స్వర్ణ శ్రీనివాస్,సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా, సుమలత,డ్రైవర్లు సందీప్, సాయి,గ్రామ పెద్దలు తోలెం నాగబాబు,కృష్ణయ్య,హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: