CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జూలూరుపాడు మండల కేంద్రంలో బస్ షెల్టర్ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఎ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి.ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగుల్ మీరా అరెస్ట్..

Share it:


మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 11 మండల కేంద్రంలో బస్ షెల్టర్ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ.. పబ్లిక్ టాయిలెట్ బస్ షెల్టర్ గురించి అనేక సార్లు ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎమ్మెల్యే, కలెక్టర్, మంత్రి కి సమస్యను తెలియజేసిన ఇంతవరకు ఎలాంటి స్పందన లేనందున ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి 264/ఆ సర్వేనెంబర్ లో గల ప్రభుత్వ భూమిని పబ్లిక్ టాయిలెట్స్, బస్ షెల్టర్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం 20 లక్షల రూపాయల బడ్జెట్ తో కూడుకున్న పబ్లిక్ టాయిలెట్స్ బస్ షెల్టర్ ఏర్పాటు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ విఫలమయ్యారని ప్రజలకు ఉపయోగపడని ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు నాగుల్ మీరాను తనతో ఉన్న యువజన నాయకులను స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఈ కార్యక్రమంలో జై వైఎస్ఆర్ జిల్లా సమితి సభ్యులు నాయకులు కొట్టే నరేష్, దినేష్, మండల నాయకులు పసుపులేటి పవన్, చిమట ముత్తయ్య, కలసాని నరసింహారావు, లక్ష్మణ్ ,అజయ్, వంశీ, బన్ను శివ, రాము ,యాకుబ్ రామకృష్ణ, నాగరాజు సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: