CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఎల్వోసీ లెటర్ అందజేత.నిరుపేదల సంక్షేమం టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: ఈరోజు హైదరాబాదు అసెంబ్లీలోని తన చాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బుధవారం నాడు పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామానికి చెందిన కే.సైదులు కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.250000 రూపాయల ఎల్వోసీ లెటర్ ను రేగా కాంతారావు వారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ,సీఎం సహాయనిధి కింద అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి ఆపద్బంధులా ఆదుకుంటుందని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తుందన్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సహాయం బాధితులకు అందిస్తుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదలు ప్రాణాలు నిలబడుతున్నాయనని అని అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యా కు, సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని వారు భరోసా ఇచ్చారు.

Share it:

TS

Post A Comment: