CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సమాజ వికాసమే రంజాన్ పరమార్ధం. కో-ఆప్షన్ సభ్యుల షేక్ సోందుపాషా.

Share it:

 



  • సామూహిక ప్రార్థనలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక వాతావరణం
  • మండల వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు

మన్యం మనుగడ కరకగూడెం:పరస్పర శాంతికి, సహనానికి , సుహృద్భావానికి పవిత్రతకు క్రమశిక్షణకు ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం ప్రజానీకం నిర్వహించుకునే పవిత్ర పర్వదినం రంజాన్ పండుగని కరకగూడెం మండల కో-ఆప్షన్ సభ్యులు షేక్ సోందుపాషా అన్నారు.ఈ మేరకు ఆయన మంగళవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని జామ మసీదులో ప్రార్థనల అనంతరం ముస్లిం మతపెద్దలు,పిల్లలతో ఆత్మీయంగా అలాయి బలాయి నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ వికాసం మే రంజాన్ పరమార్ధం అని రంజాన్ అంటేనే శుభవేళ అని, పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై జాతీయతకు సంస్కృతి వికాసానికి దోహదం చేస్తూనే ఉంటాయని తెలపడంలో ఎలాంటి సందేహాలు లేవన్నారు.రంజాన్ పండుగను ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించి నిర్వహించుకోవడానికి ప్రధాన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే అని పేర్కొన్నారు.కాగా మండల వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.మండల కేంద్రంలో గల సాఫియా ,పద్మాపురం మసీదులో కూడా ఉదయం నుంచే ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. కరోనా దృష్ట్యా రెండేళ్ల తర్వాత మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించసాగారు. ముస్లిం మత గురువులు పండుగ పరమార్ధాన్ని చదివి వినిపించారు. నెలవంక దర్శనం తర్వాత ఈద్ ఉల్ ఫితర్ పండుగను ముస్లింలు ఎంతో ఆనందంగా జరుపుకోసాగారు.30 రోజులుగా ముస్లింలు చేపట్టిన ఉపవాస దీక్షలు సోమవారం ముగిశాయి. వైరస్ తగ్గుముఖం పట్టడంతో కుటుంబ సభ్యులతో వచ్చి నమాజ్ చేయడం సంతోషంగా ఉందని పలువురు ముస్లింలు చెబుతున్నారు.

Share it:

TS

Post A Comment: