మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కేంద్రంలో పఠాన్ అక్బర్,సయ్యద్ మక్బుల్ హుస్సేన్,నివాసాలలో రంజాన్ పండుగ వేడుకలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ సందర్భంగా ముస్లిం సోదరి సోదర మణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.ముస్లిం ప్రజానీకానికి సీఎం కేసీఆర్ గారు అండగా ఉన్నారని ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ,షాదీ ముబారక్ పథకం ద్వారా ప్రతి పేదింటి ముస్లిం ఆడబిడ్డలకు 1,00,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు.ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.రంజాన్ ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని, దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు జీవనశైలిని మార్చుతాయన్నారు.అందరికీ అల్లా దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు.రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది , సర్వమతల సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, ముస్లిం మైనార్టీ పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: