CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చదువుకు పునాది రాత బోర్డు ముఖ్యం.. బండారుగూడెం పాఠశాలకు జీ తెలుగు టీవీ ఛానల్ వారి ఆధ్వర్యంలో బోర్డులు ఏర్పాటు..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::


దుమ్ముగూడెం మండలం లోని బండారిగూడెం ప్రాథమిక పాఠశాలలో జి తెలుగు టీవీ ఛానల్ వారు తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలు బోర్డును ఏర్పాటు చేసుకుంటు బండారుగూడెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బోర్డులు 500 లక్ష్యాన్ని చేరుకున్న సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, సర్పంచ్ వెంకటేశ్వర్లు, విద్యా కమిటీ చైర్మన్ నాగేశ్వరావు, మండల విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్య చేతుల మీదుగా కేకు కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల అభివృద్ధి అధికారి చంద్రమౌళి పాల్గొని పాఠశాలకు బోర్డును ఏర్పాటు చేసిన జీ తెలుగు టీవీ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మండల విద్యాశాఖ అధికారి సమ్మయ్య మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బండారుగూడెం పాఠశాల అభివృద్ధి చేసిన ప్రధానోపాధ్యాయుడు , కృషికి వారికి సహకరించిన గ్రామ పాలకవర్గం, విద్యా కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. తదనంతరం గిరిజన సంప్రదాయానికి నృత్యాలు, ఆటపాటలతో గిరిజన మహిళలు సాంప్రదాయంగా వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం భద్రాచలం చెందిన మాధురి కళాకారిణి బృందంతో కూచిపూడి నృత్యాలు చేశారు అనంతరం పిల్లలకు, తల్లిదండ్రుల మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీ తెలుగు ఛానల్ ప్రతినిధుల బృందంతో పాటు, మండల రిసోర్స్ అధికారి ప్రభాకర్, పాఠశాల ఉపాధ్యాయులు సీతారాం, వంశీ మోహన్, ఐటీసీ ప్రతినిధి సుబ్బయ్య, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: