CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వడ్డెర సంఘం కన్వీనర్ గా ఉప్పతల ఏడుకొండలు ఏకగ్రీవ ఎన్నిక...

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వడ్డెర సంఘం జిల్లా కన్వీనర్ గా ఉప్పతల ఏడుకొండలు ను రాష్ట్ర నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాల వడ్డెర సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో చండ్రుగొండ గ్రామానికి చెందిన ఉప్పతల ఏడుకొండలు ను రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి అంతయ్య అధ్యక్షతన జిల్లా కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పతల ఏడుకొండలు మాట్లాడుతూ.... వడ్డెర సంఘం జిల్లా కన్వీనర్ గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి అంతయ్య, కు రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం తో ఇచ్చిన ఈ పదవిని వడ్డెర సంఘం హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని వడ్డెరలను ఏకం చేసి సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఏడుకొండల ను అభినందించిన రాష్ట్ర నాయకులు రాయల చందర్, చండ్రుగొండ మండలం వడ్డెర సంఘం నాయకులు.. దండుగుల మల్లేష్, కే భద్రం, డి సాంబశివరావు, డి పుల్లారావు, డి రాములు, పి సత్యం, డి వేణు, డి శ్రీను, కే కాశీం, జి తిరుమలరావు, సిహెచ్ భూపాల్, చల్లా కృష్ణయ్య, యు గొపాల్, తదితరులు పాల్గొన్నారు. 

Share it:

TS

Post A Comment: