CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పేద కుటుంబాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ ధ్యేయం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు.పేదింటి ఆడబిడ్డలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం.

Share it:



  • రూ.95,11,020/- రూపాయల కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన విప్ రేగా కాంతారావు


మన్యం టీవీ మణుగూరు:


పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని తహసిల్దార్ కార్యాలయం నందు శుక్రవారం మణుగూరు తహశీల్దార్ నాగరాజు ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా ప్రభుత్వం ద్వారా మంజూరైన *రూ.95,11,020/- తొంబై ఐదు లక్షల,పదకొండు వేల,ఇరవై రూపాయలు* విలువ చేసే చెక్కులను 95 మంది లబ్ధిదారులకు విప్,రేగా కాంతారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో రూ.1,00,116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని విప్ రేగా కాంతారావు తెలిపారు.సీఎం కేసీఆర్ దేశంలో లేనటువంటి అనేక పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని రైతు బంధు,రైతు బీమా,ఇవే కాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.గత ప్రభుత్వాలు ఏనాడు పేదల సంక్షేమం కోసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.పేదల కష్టాలు దగ్గర నుండి చూసిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ,పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని ఆయన అన్నారు.ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారుల అంతా మరింత మంది అర్హులకు పథకం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా కృషిచేయాలని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకం పేద మధ్య తరగతి కుటుంబాల ఆడబిడ్డల పెండ్లిలకు కొండంత అండగా నిలుస్తుందని అన్నారు. ఆడబిడ్డల పెండ్లిలు తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకం ప్రవేశపెట్టారన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్,గర్భిణీలు,చిన్నారుల ఆరోగ్యం కోసం,ఆరోగ్య కళ్యాణ లక్ష్మి పథకం,బాలింతల చిన్నారుల కోసం కెసిఆర్ కిట్టు లాంటి పథకాలను ప్రవేశపెట్టారు అని,ఆయన గుర్తు చేశారు.సీఎం కేసీఆర్ పరిపాలన లో సంక్షేమానికి పెద్ద పీట వేశారని,ఆసరా పింఛన్, రైతుల కోసం రైతు బందు,రైతు బీమా,24 గంటల ఉచిత కరెంట్,పేదల కోసం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,వంటి అనేక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరికీ అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు.దళిత బంధు పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు.మొదటి విడత లో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. నియోజకవర్గంలో రెండు వేల మందికి దళిత బంధు అందిస్తున్నట్లు విప్ రేగా తెలిపారు.మూడువేల ఇండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఉండి,ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల రూపాయలు అందిస్తామని ఆయన అన్నారు.త్వరలోనే పథకాలు ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు.ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్ రూ.7,700 కోట్లు కేటాయించారని తెలిపారు. నిధులతో పాఠశాలలకు అవసరమైన అన్ని వసతులు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఎంపీటీసీ ల జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,స్థానిక సర్పంచ్ బచ్చల.భారతి, సర్పంచ్ లు ఏనిక ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు, పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: