CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇష్టారాజ్యంగా ఇటుక బట్టిలు ఏర్పాటు-పట్టించుకునే అధికారులే కరువాయే

Share it:



  •  అసలు లెక్కలోనే లేని మట్టి ఇటుక బట్టీలు


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం ఇంటి నిర్మాణానికి ప్రధానంగా ఉపయోగించేవి ఇటుకలు. వీటిని కొందరు అక్రమ వ్యాపారంగా మలుచుకొని దందా నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమతుల లేకుండా ఇష్టానుసారంగా బట్టిలు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్తును తమ వ్యాపారానికి అనుగునంగా వాడుకుంటున్నారు. మట్టి కోసం చెరువుల్లో తవ్వకాలు చేపడుతున్నారు. జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుకబట్టీలపై ప్రత్యేక కథనం. అశ్వారావుపేట, ధమ్మపేట మండలాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో 40-50 ఇటుక బట్టీలు ఎటువంటి అనుమతులు లేకుండా వెలిసినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బట్టీలను ఏర్పాటు చేయాలంటే పట్టా భూముల్లో కాకుండా, నాలా అనుమతి (కమర్షియల్‌ ల్యాండ్‌) తీసుకున్న ఇతర ప్రదేశాల్లో మాత్రమే చేయాలి. అశ్వారావుపేట, మందలపల్లి ధమ్మపేట ప్రాంతాల్లో ఇవేమీ పట్టని ఇటుక వ్యాపారులు రైతులకు ఎంతో కొంత ఇచ్చి వారి పట్టాభూముల్లో ఏర్పాటు చేస్తున్నారు. పంటలు సాగు చేసుకునే రైతులను మభ్యపెట్టి వారి పంటపొలాల నుంచి మట్టిని తీసుకుంటూ ఇటుకలు తయారు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో అక్రమంగా మట్టిని తవ్వుతూ ఇటుకల తయారీకి ఉపయోగిస్తుండటం కనిపిస్తుంది. గ్రామ శివారుల్లో ప్రధాన రహదారి పక్కన ఇటుక బట్టీని నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ బట్టీల నిర్వహణ కొనసాగుతుంది. ఇటుక బట్టీని కాల్చిన సమయంలో వెలువడే పొగతో వాహనదారులు ఇబ్బందులకు గురువుతున్నారు. వ్యవసాయానికి ఉపయోగించే ఉచిత విద్యుత్తును వాడుకుంటున్నారు. అనుమతులు ఎక్కడ.. శూన్యం.. ఇటుక బట్టీ ఏర్పాటు చేయాలంటే పరిశ్రమలశాఖ, మైనింగ్‌, రెవెన్యూ, కార్మికశాఖ, రవాణశాఖ, విద్యుత్తుశాఖ, తదితర శాఖల నుంచి అనుమతులు తీసుకొని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అశ్వారావుపేట నియోజక వర్గంలో ఐదు మండలాల్లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల్లో ఇవేవీ కనిపించవు. పట్టాభూముల్లో ఏర్పాటు చేయటమే కాకుండా స్థానికంగా అందుబాటులో ఉండే వనరులన్నీ ఉపయోగించుకుంటూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఏళ్లుగా వ్యాపారం కొనసాగుతున్నా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్క అనుమతి లేకున్నా సదరు నిర్వాహకులపై చర్యలు తీసుకోవటంతో పాటు, బట్టీలను సీజ్‌ చేసే అధికారం మండల రెవెన్యూ అధికారులు ఉన్నా ఇప్పటివరకు ఒక్క బట్టీపై చర్యలు తీసుకోలేదు. గ్రామస్థాయిలో ప్రత్యక్షంగా బహిరంగంగా వ్యాపారం కొనసాగుతున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉచిత విద్యుత్తు వాడకం.. ప్రభుత్వం వ్యవసాయం కోసం 24గంటల పాటు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుంటే, ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహించే వారు మాత్రం ఉచిత విద్యుత్తును తమ వ్యాపారానికి వాడుకుంటున్నారు. ఇటుక బట్టీ నిర్వహణకు నీరు అధికంగా అసవరం ఉంటుంది. పట్టా భూముల్లో ఉండే వ్యవసాయ మోటారు బోరు నుంచి పైపులు వేసుకొని ఉచిత విద్యుత్తును వాడుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కొందరు వ్యాపారులు జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలోని ఇటుకబట్టీల వద్ద ఉచిత విద్యుత్తు చౌర్యం జరుగుతున్నా విద్యుత్తుశాఖ అధికారులు అటువైపు కూడా చూడరని, రైతులు ఆరోపిస్తున్నారు. బిల్లులు చెల్లించని రైతుల మోటార్ల కనెక్షన్లు తొలగించే అధికారులు, విద్యుత్తు చౌర్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవటం ఏంటని......? పలువురు తమ వాదనను వినిపించారు. RDO వివరణ:- ప్రాంతంలో ఇటుక బట్టీల నిర్వహణ కోసం రెవెన్యూశాఖ తరఫున ఎటువంటి అనుమతులు జారీ చేయలేదు. పట్టా భూముల్లో ఏర్పాటు చేయరాదు. అటువంటి వాటిలో ఏర్పాటు చేస్తే మండల తహసీల్దార్‌లతో పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించి ఏర్పాటు చేసిన బట్టీలను పరిశీలించేలా ఆదేశాలు జారీ చేస్తాం. నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.

Share it:

TS

Post A Comment: