CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కొత్త కావడిగుండ్లలో కదంతొక్కిన ఎర్రదళం -సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ -ప్రజా పందా నూతన కార్యాలయం ప్రారంభం -హాజరైన జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట: మండల పరిధిలోని కొత్త కావడిగుండ్ల గ్రామంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఆధ్వర్యంలో మేడే జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు హాజరై మేడే జెండాను ఆవిష్కరించారు.కొత్త కావడి గుండ్ల గ్రామస్తులు నిర్మించుకున్న సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా గ్రామ స్థాయి కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజా పందా నాయకులు వాసం బుచ్చిరాజు అధ్యక్షతన జరిగిన సభలో ప్రజాపందా రాష్ట్ర నాయకులు కెచ్చల రంగయ్య, గోకినేపల్లి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ 136 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో కాల్పుల్లో మరణిస్తూ తమ చొక్కాలను రక్తంలో ముంచి ఎర్ర జెండాను ఎగరేయడం జరిగిందని ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచం నలు దిక్కుల కార్మిక కర్షకులకు ఎర్రజెండా దిక్సూచిలా పనిచేస్తుందని ఆనాడు ఎందరో త్యాగాల ఫలితమే ఈనాటి మనం అనుభవిస్తున్న హక్కులని అటువంటి హక్కులను హరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని గతం కంటే మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహించాలని ఆ పోరాటాలలో ప్రజల భాగస్వామ్యం మరింత చైతన్యవంతంగా ఉండాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఉచిత వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుచకుండా మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశ ప్రజల ఆస్తులు అయినటువంటి, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను సంతలో సరుకులు లాగా కార్పొరేటు వ్యవస్థలకు కట్ట పెడుతుందని దీని వలన దేశ ఆర్థిక వనరులు మొత్తం ఆదాని లకు అంబానీలకు కట్టబెడుతూ, లక్షలాది మంది కార్మికులను ఉద్యోగాల నుండి వెళ్లగొట్టాలని ఇది దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలనివారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న కెసిఆర్ ప్రభుత్వం ప్రతిపక్షమే లేకుండా చేశామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసాయని, దళితులకు 3 ఎకరాల భూమి, పెన్షన్లు, డబల్ బెడ్ రూమ్ ల ఊసే లేదని అధికారం నిలబెట్టుకోవడం కోసం మార్గాలు వెతుకులాట తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని వారు దుయ్యబట్టారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అరుణోదయ కళాకారులు ఉద్యమ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా జిల్లా నాయకులు గోకినేపల్లి ప్రభాకర్, అమర్లపూడి రాము, కంగాల కల్లయ్య, నూప భాస్కర్, తోడం దుర్గమ్మ, వాసం బుచ్చిరాజు, బాడిశ లక్ష్మణరావు, కంగాల భూలక్ష్మి, గొంది లక్ష్మణరావు, మడకం వెంకట లక్ష్మి, మడకం దుర్గారావు, జగ్గన్న, బుచ్చయ్య,కొమరం లక్ష్మి, పోతురాజు, కొమరం లక్ష్మణ్,కంగాల వెంకటేష్, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

Share it:

TS

Post A Comment: