CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండలం లోని వివిధ గ్రామాలలో గ్రామ కమిటీలు, సమావేశాలు నిర్వహిస్తున్న తెరాస పార్టీ మంగపేట అధ్యక్షులు కుడుముల.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

జడ్పీ చైర్మన్,ములుగు జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇంఛార్జ్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు

 మంగళవారం మంగపేట మండలంలో వివిధ గ్రామాలలో బోర్ నర్సాపురం, మంగపేట ,కోమటిపల్లి, గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలలోకి విస్తృతంగా తీసుకొని వెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ బూటకపు ప్రచారమని కుడుముల లక్ష్మీ నారాయణ ధ్వజమెత్తారు. ఇక్కడ రైతు డిక్లరేషన్ పై ముసలికన్నీరు కారుస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రాలు అయిన ఛత్తీష్ఘడ్, రాజస్థాన్ లో డిక్లరేషన్ ను అమలు పరచడం చేతకాదా,అక్కడ ఉన్న రాష్ట్రంలో 24 గంటల కరెంట్, మంచినీటి సరఫరా,ప్రజలకు ఇచ్చిన సందర్భం ఉందా, అక్కడ ఉన్న రైతులకు రైతు బంధు ,రైతు బీమా ఇచ్చినట్లు దాఖలాలు లేవు ,ఇలాంటి కల్లబొల్లి మాటలు చెప్తూ రైతులను ,ప్రజలను మోసం చేస్తున్నారని ఈ అబద్ధపు ప్రచారాన్ని తెరాస పార్టీ కార్యకర్తలందరు తిప్పికొట్టాలని, మీరు 3 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గా ఉన్న మీరు తెరాస ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల చెక్కులను పంచుతూ తెరాస పార్టీ పై బురద చల్లుతూ ప్రజలను మభ్య పెడుతూ అన్ని రోజులు ప్రజలను మోసం చేస్తున్నారు.ప్రజలు మీ మాయమాటలు వినడానికి సిద్ధంగా లేరు,ప్రజలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు ప్రజలకు పనికి వచ్చే పనులు చేస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా తయారు అయినది అని టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి,జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు,మాజీ జడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం,మైనార్టీ మండల అధ్యక్షులు అఫ్జల్ ,పి ఏ సి ఎస్ డైరెక్టర్లు,నర్రా శ్రీధర్ సింగరిబోయిన నర్సయ్య,అచ్చ సత్యనారాయణ,మండల నాయకులు,చిట్టిమల్ల సమ్మయ్య,మండవ రామకృష్ణ, కోదండం ,అన్వర్,మార్పుల వెంకట్ రెడ్డి,ఆయుబ్,హనుమంతరావు,లోడే కృష్ణ, మధుకర్ ,వేణు నాగరాజు,లింగక్క, భుట్టో,ముగల రమేష్,నర్సింహా మూర్తి,ఏకాంతం,,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,యూత్ మండల ఉపాధ్యక్షులు సంకోజు ప్రశాంత్,జాడి కృష్ణ ,బోర్ నర్సాపురం గ్రామ 

కమిటీ అధ్యక్షులు రావుల రమణ,మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, కోమటిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: