CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రమాద నివారణ చర్యలలో చిత్తశుద్ధి ఏది?.పట్టించుకోని అధికార గణం.

Share it:


  • ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే గుర్తుకువచ్చే నివారణ చర్యలు


మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణంలో రింగ్ రోడ్డు నుండి ఖమ్మం రోడ్డు, జంగారెడ్డిగూడెం రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారాయని, ప్రమాదాల్లో అనేక మరణాలు కూడా సంభవించాయని, మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయని, ఎప్పుడు ప్రమాదాలు జరిగినా అప్పటికప్పుడు ఏవో నివారణ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టి వదిలేస్తున్నారు తప్ప శాశ్వత ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టడం లేదని, దీంతో అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం రోడ్ లో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కార్యాలయాలు ఉండడంతో నిత్యం ప్రజలు రద్దీ ఎక్కువ ఉండటమే కాకుండా, సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు, కాలినడకన ప్రజలు ఆయా కార్యాలయాల్లో పనులకోసం వస్తుంటారని, అదే మార్గంలో ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు గాని, వేగ నియంత్రణ చర్యలు కానీ లేకపోవడం మూలంగా అనేక ట్రాన్స్ పోర్టు వాహనాలు, భారీ వాహనాలు అదుపుచేయలేని వేగంతో ప్రయాణించడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి కావడమే కాకుండా అనేక ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. అనేక మరణాలు కూడా సంభవించిన ఘటనలు అనేకం ఉన్నాయి కళాశాల విద్యార్థులు, పాదచారులు, ద్విచక్ర వాహన దారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. జంగారెడ్డిగూడెం రోడ్డు లో దాబాలు, రెస్టారెంట్లు, అధికంగా ఉండటమే కాకుండా పేపర్ బోర్డు కు వచ్చే లారీలు సంఖ్య పెరగడంతో నిత్యం లారీలను రోడ్డుపైనే నిలిపి ఉండడం వలన పేపర్ బోర్డు ప్రాంతంలో రోడ్డుపై అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలో అనేక సార్లు మీడియాలో అనేక కథనాలు వచ్చినప్పటికీ, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారు తప్ప సంబంధిత శాఖ అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ పట్టించుకోకుండా రక్షణ చర్యలను గాలికి వదిలేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గతంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రమాదాల నివారణ కోసం స్పీడ్ గన్నులు ఏర్పాటు చేశామని, అక్కడక్కడ డ్రమ్ములో మట్టిపోసి రోడ్డుకు అడ్డంగా పెట్టి వేగ నియంత్రణ చేపట్టామని చెప్పినప్పటికీ అవి ఆచరణలో ఎటువంటి ఫలితం ఇవ్వలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి తన స్వంత ఖర్చులతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేద్దామని ప్రయత్నించినప్పటికీ హైవే రోడ్డు కావడంవలన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకూడదని ఆర్ అండ్ బి అధికారులు తెలిపినట్లు సమాచారం. సంబంధిత అధికారులు దృష్టి సారించి ప్రమాదం జరిగినప్పుడు ఆలోచించడం కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చని ఆ దిశగా సంబంధిత అధికారులు ప్రభుత్వం ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Share it:

TS

Post A Comment: