CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారికి అప్పీల్ సంస్థ 45 వేల రూపాయల ఆర్థిక సహాయం.

Share it:


 ములకలపల్లి:(మే28):మన్యం మనుగడ ప్రతినిధి:

మండలం లోని పొగళ్ళపల్లి గ్రామంలో నివసిస్తున్న చంద్రకళ అనే 10 సంవత్సరాల చిన్నారి యొక్క తల్లి ఇటీవలే క్యాన్సర్ వ్యాధితో మరణించగా,తండ్రి మూడు సంవత్సరాల క్రితమే మరణించడంతో దిక్కులేని అనాధగా మిగిలిపోయ ఆ పాపకు అప్పీల్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గోళ్ళ రమేష తాను పనిచేసే సింగరేణి సంస్థ లోని పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు చిన్నారి గురించి తెలియజేయడంతో వారు ఎంతో దయార్థ హృదయంతో 45 వేల రూపాయలను చిన్నారి చంద్రకళ కోసం వితరణ చేశారు.68 మంది ఉద్యోగులు పనిచేస్తున్న సింగరేణి పర్చేజ్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం అందించారు.ముఖ్యంగా జనరల్ మేనేజర్ ఎ రమేష్ రావు, 10,000 రూపాయలు,అడిషనల్ జనరల్ మేనేజర్ సి.హెచ్ నవీన్ కుమార్10,000 రూపాయలు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ సుమలత5,000 రూపాయలు సాయం అందించి తమ ధాతృత్వాన్ని చాటుకున్నారు.ఈ విధంగా పోగుచేసిన మొత్తం 45 వేల రూపాయలను అప్పీల్ సంస్థ అధ్యక్షుడు గొళ్ళ రమేష్ పోగళ్ళ పల్లిలో జరిగిన కార్యక్రమంలో చిన్నారి చంద్రకళకు గ్రామ సర్పంచి వగ్గెల రమణ ఎంపీటీసీ,వైస్ ఎంపిపి కొదుమూరి పుల్లారావు,ములకలపల్లి మండల బి ఎస్ పి పార్టీ అధ్యక్షుడు సాదం శ్రీనివాస్, పాలకుర్తి ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో సింగరేణి డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర కెవిబిఎన్ పద్మావతిదేవి అందజేసిన 30 జతల కొత్త దుస్తులను గ్రామంలోని పేద పిల్లలకు అప్పిల్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గోళ్ళ రమేష్ అందజేశారు.

ఈ సందర్భంగా గొళ్ళ రమేష్ మాట్లాడుతూ తాము అందజేసీన 45 వేల రూపాయలను పోస్ట్ ఆఫీస్ లో లేదా బ్యాంకులో చంద్రకళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తనకు ఆ సొమ్ము భవిష్యత్తులో ఉపయోగ పడేలా చూడాలని గ్రామ పెద్దలను కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వగేల రమణగారు,ఎంపీటీసీ కొదుమూరి పుల్లారావు,పోగళ్ళపల్లి లో నివసిస్తున్న మాజీ మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు పాలకుర్తి ప్రసాద్,ములకలపల్లి మండల బి ఎస్ పి పార్టీ అధ్యక్షుడు సాదం శ్రీనివాస్,అశ్వరావుపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నారావు,సాక్షి విలేఖరి బండారు శివ,పోస్ట్ ఆఫీసర్ కె శ్రీనివాస్,గ్రామ పెద్దలు పి నర్సింహారావు, ఆరోగ్య మిత్ర మడకం చిరుమప్ప ,వార్డ్ మెంబర్ కె రమ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సింగరేణి పర్చేస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు, గొళ్ల రమేష్ కు పొగళ్లపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: