CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ముగిసిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం.

Share it:

 


  • ముఖ్యఅతిథిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క.
  • క్రీడా పాఠశాలకు కనీస సౌకర్యాలు కల్పించాలి సీతక్క ములుగు ఎమ్మెల్యే కాంగ్రేస్ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి.
  • పాఠశాల పౌండర్.ప్రిన్సిపాల్. బి వి రమణ మూర్తి.
  • జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనంకు పూర్వ గురువులు,విద్యార్థులు రెండవ రోజు కార్యక్రమానికి హాజరై పాఠశాల ఆవరణంలో సమావేశం జరిగినది.ఈ

సమావేశంనకు క్రీడా పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ టి వెంకటరాజు సభా అధ్యక్షత వహించారు.అతిథులుగా పాఠశాల ఫౌండర్ ప్రిన్సిపాల్ బి వి రమణమూర్తి,సీతక్క ములుగు ఎమ్మెల్యే కాంగ్రేస్ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి హాజరైనారు. అనంతరం సీతక్క మాట్లా డుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తర్వాత విద్యా వ్యవస్థ పై ప్రయోగాలు చేయడం ప్రారంభమైంది.కానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు,గురుకుల వ్యవస్థ లోని పాఠశాలలు చాలా మటుకు నిర్వీర్యం అయినాయి.ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తూ వ్యాపార విద్యగా రోజురోజుకు పుంజుకుంటుంది ఒక ప్రభుత్వానికి గీటురాయి విద్యా,వైద్య రంగాల నిర్వహణ మాత్రమే అనడం అతిశయోక్తి కాదు.ఈ పాఠశాల వ్యవస్థలో బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించిన అప్పుడే దేశ భవిష్యత్తు ఉంటదని చెప్పారు.గురుకులాల వ్యవస్థలో కేజీ టు పీజీ విద్యను ఉచితంగా ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తన మేని ఫెస్టోలో పెట్టుకున్నప్పటికీ నేటికీ కార్యరూపం దాల్చలేదని,ఈ బడుగు బలహీన వర్గాల పేద పిల్లల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.గురుకులాల వ్యవస్థను ఇబ్బడిముబ్బడిగా అప్ గ్రేడ్ చేస్తున్నప్పటికీ కనీస భవనాలు సరిపడా లేవు.నీరు,తరగతి గదులు,డార్మెన్టరీలు,టాయిలెట్స్,బాత్రూంలు కనీస సౌక ర్యాలు లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని అన్నారు. ఏటూర్ నాగారం క్రీడా పాఠశాల లో సరైన మెనూ లేకపోవడం తో,విద్యార్థులు,క్రీడానైపుణ్యతను సాధించలేకపోతున్నారని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగా ణ రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల వ్యవస్థ బలోపేతం చేయాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నామని,గురుకుల వ్యవస్థ బలపడిన ప్పుడే విద్యార్థులు గుణాత్మకమైన విద్యను పొందుతారు దేశ,

విదేశాలలో వారి యొక్క నైపు ణ్యతను కొనసాగించి దేశ అభివృద్ధికి తోడ్పడతారని పిలుపునిచ్చారు.చదువుకున్న పాఠశాలను,గురువులను ఏ స్థాయిలో ఉన్న మర్చిపోవద్దు

అది మన గౌరవాన్ని పెంచుతుందని ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా తెలియజేసారు.ఈ విద్య భూమిని అప్పటికూడా మర్చిపోకూడదు.ఈ యొక్క క్రీడా పాఠశాలలు,ఆశ్రమ పాఠశాలలు,ఎస్సీ,ఎస్టీ,బిసి పాఠశాలల సమష్యాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే సీతక్కకు పాఠశాల ప్రిన్సిపాల్ టి.వెంకట రాజు 2019 క్రీడా పాఠశాలగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ దీనికి సరైన నిధులు కేటాయించడం లేదని, విద్యార్థులకు మెనూ ప్రకారం నిధులు కేటాయించడం లేదని, ఈ క్రీడా పాఠశాల కు తగిన బాస్కెట్బాల్ కోర్టు,క్రీడా వసతులు లేకుండా పోయినాయని అన్నారు.

స్కూలుకు లైటింగ్స్ కూడా సరిగా లేవని వివరించారు.

 దీనిని మీరు శ్రద్ధ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. దీనిపై సీతక్క స్పందిస్తూ పాఠశాల యొక్క సమస్యలపై స్పందించి జిల్లా కలెక్టర్,రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడ తానని హామీ ఇచ్చారు.

బి వి రమణమూర్తి విద్యా ర్థులను ఉద్దేశించి మాట్లా డుతూ.సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధిస్తాం అని గుర్తుంచుకోవాలని,సమాజంలో గౌరవంగా బ్రతకాలి ఆశిస్తూ, ఏటూరునాగారం గురుకుల ఆశ్రమం మర్చిపోకుండా ఈ అల్యూమ్ని కార్యక్రమాలు ప్రతి సారి జరుపుకోవాలని పూర్వ విద్యార్థులను కోరారు.పాఠశాల పూర్వ విద్యార్థులు చాప బాబు దొర,థౌర్యనాయక్,పులుసం పురుషోత్తం,రాజా నాయక్,

డాక్టర్ రాజన్న,కొమరం ప్రభాకర్ లు మాట్లాడుతూ. పాఠశాలలో చదివిన విద్యా ర్థులు వివిధ ప్రభుత్వ,ప్రవేట్, పారిశ్రామిక రంగాలు మరియు విద్యావేత్తలు గా స్థిరపడి ఉన్న వారు పాఠశాల అభివృద్ధికి మరియు దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్న విద్యార్థుల కుటుంబాలకు విద్య,వైద్యం,

ఆర్థికం,ఉద్యోగ పరంగా కెరీర్ మార్గదర్శకాలు ఇచ్చేందుకు వివిధ స్థాయిలలో కమిటీలు వేసి తగు న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పారు.

పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రతి సంవత్సరం పదో తరగతి చదువుతున్నటు వంటి విద్యార్థులకు కెరీర్ తర్పీజు ఇచ్చేందుకు విద్యా వేత్తలున్నారని వివరించారు.

పాఠశాల పూర్వ విద్యార్థి గుమ్మడి లక్ష్మీనారాయణ రచయిత రచినా 'ఆది యోధులు' పుస్తకం ను ములుగు ఎమ్మెల్యే సీతక్క పూర్వ గురువులు ఆవిష్కరణ చేశారు.వివిధ బ్యాచిలకు చెందిన పూర్వ విద్యార్థులు పాఠశాలలో పని చేసిన గురువులను శాలువా మరియు మెమోటో లతో శత్కరించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ గురువులు సుదర్శన్, పాపయ్య,రవీందర్ రేడ్డి,

గురువప్ప,రవిచందర్, ఇమ్మానియేల్,అజిజ్, నారాయణ రెడ్డి,వెంకటేశ్వర్లు, సత్తయ్య,సత్యనారాయణ రెడ్డి,వెంకటేశ్వర్లు,ఆచార్య, బురాన్,ఉపేందర్ రెడ్డి, సదానందం,ఉప్పలయ్య, మహేశ్వరయ్య తో పాటు పూర్వ విద్యార్థులు థౌర్య నాయక్,ఐ.ఆర్.ఎస్,రాజ నాయక్ ఫోరెన్సిక్ డిఎస్పి

జితేంద్ర,సైంటిస్ట్ మంగీలాల్ డిజెఎం డాక్టర్ రాజన్న,చాప బాబు దొర,లాఖాన్ సింగ్,

చందా నరేష్,గుమ్మడి లక్ష్మీనారాయణ,ప్రోగ్రాం చైర్మన్ కొమురం ప్రభాకర్,ఫుడ్ ఇన్చార్జి పులుసం పురుషోత్తం, మీడియా ఇంచార్జ్ దబ్బగట్ల సుమన్,చందా మహేష్, ఐటిడిఎ ఏటూరునాగారం స్పోర్ట్స్ అధికారి యాలం ఆదినారాయణ,బంగారు ప్రకాష్,సల్లా లక్ష్మణ్,పెనుక ప్రభాకర్ 32 ఎస్ఎస్సి బ్యాచ్ ల పూర్వ విద్యార్థులు

పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: