CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.భారతదేశ "అమ్యూ రత్నం" డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్.

Share it:

 


  • ములుగు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు.

మన్యం మనుగడ ములుగు

భారత మాజీ ఉప ప్రధాని దళిత వర్గాల స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా ములుగు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ కుసుమ జగదీష్,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇరువురు నాయకులు మాట్లాడుతూ. భారత దేశ స్వరాజ్య ఉద్యమంతో తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణం తో ముడిపడిన జగ్జీవన్ రామ్ జీవితం రాజకీయ,సామాజిక, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉందని అన్నారు.జగ్జీవన్ రామ్ స్మరించుకోవడం అంటే భారత దేశ స్వతంత్రం సామాజిక ఉద్యమం జరిగిన ఉప్పొంగిన ఘట్టాలను గుర్తు చేసుకోవడం లేదని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. జగ్జీవన్ రామ్ మహోన్నత,నాయకత్వం వ్యక్తిత్వం సేవాభావం భారత దేశ ప్రజాస్వామిక వ్యవస్థ సంస్థకు మహా బలాన్ని చేకూర్చి పెట్టాయి అని అన్నారు.భారత రిపబ్లిక్ తొలి లోక్ సభ లో ప్రవేశ ప్రవేశించిన తొలి వ్యక్తి జగ్జీవన్ రామ్ అని అన్నారు.వరుసగా ఎనిమిది సార్లు గెలిచిన వ్యక్తి అని 33 సంవత్సరాలకే కేంద్ర మంత్రిగా,దేశ ఉప ప్రధానిగా మొదటి పార్ల మెంటరీ నిలిచాడని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు.

జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ బుద్ధి సానుకూల దృక్పథం స్పష్టమైన దర్శ నికత విస్తృతమైన అధ్యయనం గొప్ప మేధాశక్తి,స్థిరమైన సంకల్పబలం,నిత్యకృషి, చర్చించే గుణం,ఒప్పించే గుణం ఆత్మవిశ్వాసం,ధైర్యం భారత దేశ "ఆమ్యూ రత్నం" డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఫ్లోర్ లీడర్ తుమ్మల హరిబాబు, జడ్పీటీసీ లు సకినాల భవాని, గై రమాదేవి అశోక్,రైతుబంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,కో ఆప్షన్ సభ్యులు రియాజ్ మిర్జా,ఎంపీపీలు గండ్ర కోట శ్రీదేవి సుధీర్,సుడి శ్రీనివాస్ రెడ్డి,బుర్రి రజిత సమ్మయ్య, గొంది వాణిశ్రీ,జిల్లా డిసిసి డైరెక్టర్ మడుగుల రమేష్,వివిధ మండలాల అధ్యక్షులు బాదం ప్రవీణ్, సూరపనేని సాయి బాబు, లింగాల రమణ రెడ్డి,గడ దాసు సునీల్ కుమార్,కుడుముల లక్ష్మీనారాయణ,ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,పోరిక గోవింద నాయక్,తాహెర్ పాషా,కృష్ణారెడ్డి,విజయ్ రామ్ నాయక్,జిల్లా టిఆర్ఎస్ పార్టీ మీడియా ఇంచార్జ్ కునురు అశోక్ గౌడ్,కుటుంబరావు మధుసూదన్ రెడ్డి,ముడతాన పల్లి మోహన్,ఆదిరెడ్డి,తుమ్మ మల్లారెడ్డి,బైకాని సాగర్, కందకట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: