CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్.

Share it:

 


  • బాబు జగ్జివన్ రామ్ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం మనుగడ ములుగు

ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో క్రీ.శే.భారత దేశ మొట్ట మొదటి ఉప ప్రధాని బాబు జగ్జివ న్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించ డం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క,ఈ సందర్భంగా మాట్లాడుతూ 

ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న..పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్,ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. భారతదేశంలో వలసవాదానికి,సామ్రాజ్యవాదానికి వ్యతిరే కంగా జరుగుతున్న స్వాతంత్రో ద్యమ పోరాటంతో పాలకుల నిర్మూలన,సామాజిక సంస్క రణ ఉద్యమాల్లో కీలకంగా పని చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్.భారత దేశ స్వరాజ్య ఉద్యమంతో పాటు తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం..రాజకీయ, సామాజిక,చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నది.1908 ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్ బీహార్​లోని షాబాద్ జిల్లాలోని చిన్న గ్రామమైన చంద్వాలో వసంతా దేవి,శోభిరామ్ దంపతులకు జన్మించారు.దళిత కులంలో పుట్టిన ఆయన పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు చురుకైన విద్యార్థిగా రాణించారని సీతక్క అన్నారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఫిషర్ మేన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,

మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,సహకార సంఘం చైర్మన్ పాన్నల ఎల్లారెడ్డి,వైస్ చైర్మన్ మర్రి రాజు,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ షకీల్,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనెటి శ్యాం,ఉప సర్పంచ్ బద్దం లింగా రెడ్డి,

ఎస్టీ సెల్ మండల ఉపాధ్య క్షులు దేవ్ సింగ్,ఎన్ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి,మేడం రమణకర్,

అబ్బన్న,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: