CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సిపిఐ ఆధ్వర్యంలో మణుగూరులో భారీ ప్రదర్శన తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాలుగా వృద్ధులు, వికలాంగులు,వితంతువులు,ఒంటరి మహిళలు 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని,సొంత స్థలం ఉన్నటువంటి వారికి గృహ నిర్మాణం కొరకు ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయాలని,దళిత బంధు పథకం దళితులు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మంగళవారం మణుగూరులో సిపిఐ కార్యాలయం నుండి ఎర్ర జెండా లు చేతపట్టుకొని అంబేద్కర్ సెంటర్ మీదుగా తాసిల్దార్ కార్యాలయం చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఈ ధర్నాను ఉద్దేశించి,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య హాజరై మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని,57 సంవత్సరాల వారికి ఒంటరి మహిళలకు,భర్త చనిపోయిన భార్యలకు వితంతు పింఛన్లు దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారని,నేటికీ అవి మంజూరు కాలేదని,అనేక మంది పేద వారు మధ్యతరగతి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ఒకవైపు గ్యాస్ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న సామాన్యుడు పై మోయలేని భారం మోపుతున్నారని వారు ఆరోపించారు.రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయాలని,అర్హత ఉన్నటువంటి వారికే పేద వారికి దళిత బందు ఇవ్వాలని డిమాండ్ ఉన్నప్పటికీ,ఈ పథకం స్థానిక ప్రజా ప్రతినిధులు సూచనల మేరకు పార్టీ కార్యకర్తలకు ఈ పథకం అమలు జరుగుతుందని,అసలైన లబ్ధిదారులకు ఈ పథకం అందడం లేదని,సంబంధిత జిల్లా అధికారులు వీటిపై దృష్టి సారించాలని అర్హత ఉన్నటువంటి వారికి పేదవారికి ఈ పథకం అమలు జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.సొంత స్థలం ఉన్నటువంటి వారికి ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఆ డబ్బులు పెరిగినటువంటి ధరల కు సరిపోవని,కనీసం రెండు గదుల ఇల్లు కట్టుకోవడానికి ఆరు లక్షల రూపాయలు ఖర్చవుతుందని కావున ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ పథకాలలో చూసి అర్హులు ఐన అటువంటివారిని చూసి, పథకాలు అమలు చేయాలి తప్ప,ఉన్నటువంటి వారికి పథకాలు అమలు జరిగేలా చూడవద్దని అసలైన లబ్ధిదారులకు ఆన్యాయం జరుగుతుందని అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని వారు అన్నారు.ఒకవైపు కేంద్రం పెట్రోల్,డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి తో సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని వారు ఆరోపించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు విసిగిపోయారని వారు ఆరోపించారు.ఇకనైనా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించవద్దని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం మణుగూరు ఇన్చార్జి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి లక్ష్మి కుమారి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మి నారాయణ,సిపిఐ మండల పట్టణ కార్యదర్శులు ఎస్ కే సర్వర్,దుర్గ్యాల సుధాకర్, ఎంపీటీసీలు కాన్సెప్ట్ రామారావు,పాయం లక్ష్మయ్య, సర్పంచ్ బాడిశ,సతీష్,ఏ ఐ టి యు సి,మండల అధ్యక్ష కార్యదర్శులు నరసింహారావు, తోట రమేష్,నాయకులు జక్కుల.రాజబాబు,భీమరాజు కృష్ణ,శ్రీకాకుళం వీరమల్లు మంగి వీరయ్య,చింతల దశరథం,బీ వీరస్వామి,ఎస్ వి నాయుడు, భాస్కర్ రావుల రాములు, ఆదరణ రాములు,రేణుక తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: