CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆకస్మికంగా మృతి చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ బుర్రా శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలి.--:ఐ ఏఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసుధన్రెడ్డి..

Share it:

 

     


            

మన్యం మనుగడ ,మణుగూరు:

                   గురువారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ బుర్ర శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి సింగరేణి యాజమాన్యం ని డిమాండ్ చేశారు. శుక్రవారం పీవీ కాలనీలోని బుర్ర శ్రీనివాస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సెక్యూరిటీ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ విభాగంలో గత 15 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న బుర్ర శ్రీనివాస్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందాడని,ఓసి 2 గేట్ లో సెకండ్ షిఫ్ట్ విధులకు హాజరై రెండు గంటల అనంతరం ఎండ ఎక్కువగా ఉండటంతో ఒంట్లో నలతగా ఉందని సెక్యూరిటీ పర్యవేక్షకుల అనుమతి తీసుకొని ఇంటికి వెళ్లి కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆరోగ్యం కుదుట పడకపోవడంతో సింగరేణి ఏరియా హాస్పిటల్ కు చేరే లోగానే ఆకస్మికంగా మృతి చెందాడని తెలిపారు. సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ విభాగం ఆరంభం నుంచి అనగా గత 15 సంవత్సరాలుగా సంస్థకు సేవలందిస్తున్న శ్రీనివాస్ కు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ నేపథ్యం కావడంతో కేవలం శ్రీనివాస్ సంపాదన మీదనే ఆయన కుటుంబం ఆధారపడి జీవిస్తున్నదని ఆయనకు ఎలాంటి బీమా పథకాలు కూడా లేవని ఆయన సేవలను గుర్తించి మానవతా దృక్పథంతో శ్రీనివాస్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించే విధంగా యాజమాన్యo తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో కూడా కాంట్రాక్ట్ కార్మికుడు సొడే చుక్కయ్య , స్థానికుడు గండికోట ముత్యాలు విషయంలో కూడా సింగరేణి యజమాన్యం ప్రత్యేక కేసుగా పరిగణించి వారిని ఆదుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి ఎండీ గౌస్, సంజీవరెడ్డి, ప్రవీణ్, శంకర్ బాబు, శ్రీనివాస్,యాకూబ్ పాషా, రవి, శేఖర్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: