CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ప్రభుత్వ విప్.

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కల్యాణపురం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని నూతనంగా ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ,భారతదేశానికి దశ ,దిశ, చూపిన రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు నిరంతరం స్కరించుకుంటూ ఆయన మార్గంలో ప్రయాణించాలని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశం సుస్థిరంగా పయనిస్తే అభివృద్ధి సాధిస్తుందన్నారు.సమాజ స్థాపన కోసం, మానవత్వం కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేని పథకాన్ని ప్రవేశపెట్టి దళిత బంధువు అయ్యారన్నారు.న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్త గా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాడు అంబేద్కర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి అమరేందర్, ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ కంచు గట్ల వీరభద్రం, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, ఎంపీటీసీ లు తాటి పూజిత,తెరాస పార్టీ సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు, జాలే రామకృష్ణారెడ్డి, చిలక వెంకట్రామయ్య, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కోరం రామారావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు గొర్రెముచు వెంకటరమణ, ఎస్ టి సెల్ అధ్యక్షులు కొరస దుర్గారావు, బీసీ సెల్ అధ్యక్షులు మామిళ్ల కనిష్, యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకల రమేష్, మండల నాయకులు మొగిళ్ళ వీరారెడ్డి, టేకుల సురేష్ రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, మేడవరపు సుధీర్, అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: