CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎండిపోతున్న పంట పొలానికి నీటి కోసం భగీరథ ప్రయత్నం.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం రాజుపేట గ్రామం లో ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చే సమయానికి నీరు లేక ఎండిపోవటానికి సిద్ధంగా ఉన్న పంటను కాపాడుకోవటానికి ఒక రైతుకు వచ్చిన ఆలోచనను వెంటనే ఆచరణ లో పెట్టాడు. సమీపంలో ఉన్న వాగునుండి నీటిని ఇంజన్ ద్వారా రోడ్డు వరకు తెచ్చాడు కానీ రోడ్డు మీదనుండి నీటిపైపు పొలం లోకి వేస్తే వచ్చి పోయే వాహనాల వలన పైపు పగిలిపోతుంది అది గ్రహించిన రైతు వాగునుండి నీటిని రోడ్డు మీదకు వదిలి అక్కడ నుండి దిగువ మడికి నీరు ప్రవహించేలా ప్రయత్నం చేస్తూ తన పంటకు నీటిని అందించటానికి అపర భగీరధుడిలా ప్రయత్నం చేస్తున్న రైతన్నకు సెల్యూట్ చేయాల్సిందే. మండలం లో నీటి కొరత వలన త్రాగు నీటికి, సాగు నీటికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ అధికారులు ఇగనైనా ప్రజలకు అందుబాటులో ఉండి రైతులకు కావాల్సిన నీటి సౌకర్యం కోసం ప్రభుత్వం తరపున వచ్చే పథకాలు లేదా కనీసం తమరి సలహాలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: