CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రయత్నానికి సాయం అందింది.క్రీడాకారిణి మట్టా దర్జారాణికి చర్లకు చెందిన జవ్వాది కుటుంబం అండగా నిలిచింది.

Share it:


మన్యం టీవీ చర్ల:

దుమ్ముగూడెం మండలంలోని పెదనల్లబల్లి గ్రామంలో గల అతి నిరుపేద కుటుంబానికి చెందిన మట్టా ముద్దరాజు రమణ దంపతుల కూతురు దర్జారాణి రాజమండ్రిలోని "ఆది కవి నన్నయ" యూనివర్సిటీలో ఎంపీఈడి కోర్సు చదువుతుంది.ఇదే క్రమంలో నేపాల్ లో జరగబోయే నేపాల్ 3ర్డ్ పోకర్ ఓపెన్ ఇండో - నేపాల్ ఇంటర్నేషనల్ గేమ్స్ - 2022 కి 100మీటర్స్ రన్నింగ్ పోటీ ఉండగా,మన ఇండియా తరపున ఇండియన్ టీమ్ కి సెలక్ట్ అయ్యింది.తన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో ఈ నెల ఏప్రిల్ 27-30 వరకు జరగబోయే అథ్లెటిక్ క్రీడలకు తన ప్రయాణ ఖర్చుల నిమిత్తం స్పాన్సర్ చేసే వాళ్ళు ముందుకు రాగలరని వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న మండలంలో గల బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ గౌరవ సభ్యులు కనుబుద్ది దేవా (కాంగ్రెస్ పార్టీ దుమ్ముగూడెం యువజన నాయకుడు),సరియం భీమరాజు(దుమ్ముగూడెం బిఎస్పీ పార్టీ కన్వీనర్),కాక మల్లేష్ మరియు వారి బిఎల్ఏ బృందం,మిత్ర బృందం బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ సారధ్యంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విస్తృతంగా ప్రచారం చేసి దాతల సాయం కోరగా కనుబుద్ది దేవా ద్వారా విషయం తెలుసుకున్న చర్ల మండలానికి చెందిన "మీ కోసం మేమున్నాం సహాయక" కమిటీ మరియు జవ్వాది కుటుంబం వారు మంచి మనసుతో స్పందించి దర్జారాణిని తమ ఇంటికి పిలిపించి మన దేశం పేరు నిలబెట్టాలని క్రీడాస్ఫూర్తిని చాలా మందిలో నింపాలంటూ రెండు మంచి మాటలు చెప్పి 25000/-రూ నగదును పెద్దాయన జవ్వాది జయ కుమార్ చేతుల మీదుగా అందించారు.ఇంత పెద్ద మొత్తంలో సాయం అందించడం పట్ల రెండు మండలాల ప్రజలు వారి మంచితనం పట్ల,దాతృత్వం పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.దర్జారాణీ వచ్చే నెల గోవాలో జరిగే క్రికెట్ క్రీడల్లో కూడా ఆడబోతున్నట్టుగా ఈ సందర్భంగా చెప్పింది.సాయం పొందిన దర్జారాణీ తల్లితండ్రులు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జవ్వది జయ కుమార్ గారు వారి కుమారులు జవ్వది రవికుమార్ జవ్వది మురళి కుమార్ మరియు మీ కోసం మేమున్నాం ఫౌండేషన్ చైర్మన్ నీలి ప్రకాష్,సభ్యులు ప్రశాంత్,సతీష్,,ప్రభుదాస్,కనుబుద్ది దేవా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: