మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.బుధవారం స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.ఏటూరు నాగారం గ్రామపంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్య పనులను గ్రామ పంచాయతీ సిబ్బంది తో పాటు స్థానిక కూలీలతో ఎప్పటికప్పుడు పనులు చేయడం జరుగుతుందని అన్నారు.వర్షాకాలం సీజన్ ఉద్దేశించి ముందస్తుగానే సైడ్ డ్రైనేజీ లో పూడిక తీట పనులు జరుగుతున్నాయని, గ్రామపంచాయతీలో ఉన్న ప్రతి డ్రైనేజీ కల్వర్టును పూర్తిస్థాయిలో తీయడం జరుగుతుందని వర్షా కాలం వచ్చేసరికి వర్షపునీరు ఎక్కడ నిల్వ ఉండకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
Post A Comment: