CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ పై కక్ష ఎందుకు.వక్ర బుద్ధి వీడి సక్రమ మార్గంలో నడవండి.తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యం గింజను కొనాలి.

Share it:


  • బిజెపి విధానాలపై నిరసన తెలిపిన పినపాక మండల ప్రజా ప్రతినిధులు, రైతులు

మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడేళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ లో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల స్థాయి ప్రజాప్రతినిధులు, రైతులు కలిసి బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి ప్రజా ప్రతినిధులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యం గింజలు కొనాలని, తెలియజేశారు. ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, పంజాబ్ మాదిరిగానే తెలంగాణలో పండించిన పంటను కొనాలని, రాష్ట్రాలపై సవతి ప్రేమ కురిపించడం సరికాదని అన్నారు.ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలి అది కేంద్రం బాధ్యత అని స్పష్టం చేశారు. రైతులను కించపరిచే విధంగా చాలా హీనంగా, ఘోరంగా అవమానిస్తున్నారు... రైతులు ఎక్కడైనా రైతులే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.బిజెపి ఢిల్లీలో ఒకమాట గల్లీలో ఒకమాట మాట్లాడుతుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వక్రబుద్దిని రైతులపై చూపించడం సిగ్గుచేట్నారు.దేశంలో విపత్కర పరిస్థితులు వస్తే కేంద్రం ఆహార నిల్వల్ని రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగ బద్దంగా ఉన్న విషయం తెలియకపోవడం విచారకరమన్నారు.మీరు వడ్లు కొనం అనటమే సమస్య ఆని, అందుకే తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితిని కేంద్రం తీసుకువచ్చిందన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో పంటలు విస్తారంగా పండిస్తున్నారంటే కారణం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి ప్రధన కారణమని వివారించారు.ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: