CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు పండించిన ప్రతి వరి గింజను కేంద్రం కొనాలసిందే.తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన వడ్లు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే తిరుగుబాటు తప్పదు ఎంపీపీ రేగా కాళిక

Share it:

 



  • డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం అందజేసిన ఎంపీపీ రేగా కాళిక మండల అధ్యక్షులు రావుల సొమయ్య పార్టీ ప్రజాప్రతినిధులు రైతులు 

మన్యం మనుగడ కరకగూడెం: తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటిశాఖ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాలమెరకు కరకగూడెం మండల కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టి అనంతరం ర్యాలీగా వెళ్ళి తహసీల్దార్ కార్యాలయం లోని డిప్యూటీ తహసిల్దార్ ఎం,సంధ్య కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఎంపీపీ రేగా కాళిక,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని,దేశంలో ఎక్కడ లేని విదంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం సేకరణపై లేనిపోని ఆంక్షలు విధిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుందన్నారు. తెలంగాణ రైతాంగంలో,ప్రజల్లో ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదన్నారు. తెలంగాణ రైతుల వరి ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బుడగం రాము,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం.నరసింహరావు, సర్పంచ్ లు భూక్యా భాగ్య లక్ష్మీ, కుంజ వసంతరావు,కొమరం.విశ్వనాధం,పోలెబోయిన నర్సింహరావు,పోలెబోయిన పాపక్క,తాటి సరోజీని,ఎస్టీ సెల్ అధ్యక్షులు పాయం.రాజబాబు,పార్టీ నాయకులు నిట్టా ఏడుకొండలు,కొంపెల్లి పెద్ద రామలింగం,వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మహిళల నాయకురాలు కాసు లావణ్య,కరకగూడెం,చొప్పాల ఉపసర్పంచ్ లు రావుల,రవి,బోడా ప్రశాంత్ రైతులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: