CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీలకు సేవ చేయటం నా స్వప్నం . గవర్నర్ తమిళిసై పూసుకుంట గ్రామాన్ని దత్తత తీసుకున్న గవర్నర్ .

Share it:


 దమ్మపేట ఏప్రిల్ 12 ( మన్యం మనుగడ ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం లోని పూసుకుంట గ్రామంలో గవర్నర్ తమిళిసై పర్యటించారు ఆదివాసీ కొండరెడ్ల డఫు నృత్యాలతో ఆట పాటలతో గవర్నర్ కు స్వాగతం పలికారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు వైద్య ఆరోగ్య సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్స్ ఐసీడీఎస్ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ జీసీసీ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తమిళిసయి శ్రద్ధగా పరిశీలించారు ఆయా శాఖల వారిని అభినందించారు ఊరు మొత్తం కలియతిరుగుతూ కొండరెడ్ల స్థితిగతులను జీవన విధానాన్ని పరిశీలించారు వారితో మాట్లాడుతూ వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా పూసుకుంట గోగులపూడి గ్రామ కొండరెడ్లకు అత్యవసర సమయాల్లో వైద్యం చేయించుకునేందుకు రెండు ఎలక్ట్రిక్ ఛార్జి బుల్ ఆటోలను రెడ్ క్రాస్ సంస్థ వారు అందించారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఉమ్మల దుర్గమ్మ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ కొండరెడ్లు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆదివాసీలకు సేవ చెయ్యటం నా స్వప్నం అని అధికారులు కొండరెడ్ల అభివృద్ధికి కృషి చేయాలని కొండరెడ్ల అభివృద్ధికి నా సహకారం ఎప్పటికీ ఉంటుందని ఇంకొక సారి మరలా వచ్చి అభివృద్దిని చూస్తానని తెలిపారు ముందుగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ఆదిమ తెగల అయినటువంటి చెంచు కొలా౦ వారి గ్రామాలలో కూడా పర్యటించి సహకారం అందించారు అని ఈ రెండు కొండరెడ్ల గ్రామాల ప్రజలకు అభివృద్ధి కోసం నలభై రెండు లక్షల రూపాయల చెక్కును జాయింట్ కలెక్టర్ గారికి అందించారు ఈ వేదికపై పలువురు గవర్నర్ ను సన్మానించారు సమావేశం తర్వాత గవర్నర్ అందరితో కలిసి భోజనం చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వారు బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాకపోవడం వలన ఆదివాసీలు నిరుత్సాహపడ్డారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఏపీవో ఫారెస్ట్ రేంజర్ జీసీసీ డీఎం ఓఎస్డీ ఎఎస్పీ రోహిత్ డీఎంహెచ్ఓ ఐసీడీఎస్ పివో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఎంపీపీ సోయం ప్రసాద్ దొడ్డాకుల రాజేశ్వరరావు ఎంపీటీసీ సోయం లక్ష్మి గంగరాజు అంకంపాలెం సర్పంచ్ కాకా అనూష భరత్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: