CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దేశానికి ఫాసిస్టు, మతోన్మాదం ప్రమాదకరం.--:సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు.

Share it:


 

మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 దేశంలో ఫాసిజం రోజు రోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్న సందర్భం ఇది. పార్లమెంటులో తమకు అనుకూలమైన ఫాసిస్టు చట్టాలను ప్రవేశపెడుతూ ప్రశ్నించిన ఉద్యమశక్తులను నిరవధికంగా జైల్లో బందిస్తున్న పరిస్థితుల్లో దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమీకృతులై మిలిటేన్సి ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్,కెచ్చల రంగారెడ్డి అన్నారు. ఈరోజు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్యుల జనరల్ బాడీ మీటింగ్ కు మాచర్ల సత్యం,కెచ్చల కల్పన, అమర్లపూడి రాము అధ్యక్షత వహించారు.ఈ జనరల్ బాడీ ప్రారంభానికి ముందు పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆంబజార్, జగదాంబ సెంటర్,పాత బస్టాండ్,భగత్ సింగ్ సెంటర్ మీదుగా కన్యకాపరమేశ్వరి సత్రం వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ దేశంలో ప్రజలకు ప్రధాన ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని బహుళజాతి కార్పొరేట్ శక్తులు తమ స్వాధీనంలోకి తీసుకుని దేశ రైతాంగాన్ని నడ్డివిరిచే అప్పుల ఊబిలోకి నెట్టివేసి ఆత్మహత్యల పాలు చేస్తున్నారని ఇది చాలదన్నట్లు గా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేసి అమలు చేయుటకు పూనుకుంటే ఢిల్లీలో రైతాంగం చారిత్రాత్మకంగా పోరాట ఫలితంగా వాటిని వెనక్కి తీసుకున్నప్పటికీ ఇంకా భారత రైతాంగం మెడలో కత్తి వేలాడుతూనే ఉందని రైతాంగాన్ని రక్షించుకొనుటకు బలమైన రైతాంగ ఉద్యమాన్ని నిర్మించాలని వారు పిలుపునిచ్చారు.

అడవి బిడ్డలకు జీవనాధారం అయిన పోడుభూములను కాపాడుకునేందుకు ఆదివాసీ, గిరిజనులు తమ భూముల రక్షణకు తెగించి కొట్లాడాలని ఈక్రమంలో ఎదురయ్యే అక్రమ కేసులు, జైలు, నిర్భందాలను సైతం అదికమించాలని వారు అన్నారు. అదేవిధంగా దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోల్ ,డీజిల్,గ్యాస్ ధరలను రోజు రోజుకు పెంచుకుంటూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని,నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుకొని పేద ప్రజల పై మరింత ఆర్ధిక భారం మోపుతున్నారని వారు అన్నారు. ఈ క్రమంలో దేశ ప్రజలు అప్రమత్తమై పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు చండ్ర అరుణ,గోకినేపల్లి వెంకటేశ్వర్లు,సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు నాయినిరాజు,ఈసం శంకర్,ముద్ధ బిక్షపతి, కల్లూరు కిషోర్,జి ప్రభాకర్, లక్ష్మయ్య నిమ్మల రాంబాబు నూక భాస్కర్ గౌస్ సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ నాయకులు పూనెం కుమార్,ఈసం భద్రయ్య అజయ్, అజ్మీర బిచ్చ,బుర్ర వెంకన్న, యాకూబ్ షావలి, యన్ సంజీవ్, పి డి యస్ యూ బద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: