CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోలీస్ ఉద్యోగాల కొరకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి.ఏడుళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్ కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్.

Share it:


మన్యం మనుగడ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ప్రకటించనున్నది. అందులో భాగంగానే ఎడుళ్ళ బయ్యారం, కరకగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలలో నిరుద్యోగ యువతి,యువకులకు పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందేందుకు వీలుగా కోచింగ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామని ఏడుళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్ కరకగూడెం,ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా అప్లికేషన్ లతో పాటు వారి విద్యార్హత పొందిన సర్టిఫికేట్ జిరాక్స్ పత్రాలతో ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో అందజేయాలని అన్నారు. నిరుద్యోగ యువతి,యువకులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకొని పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందాలని తెలిపారు. పూర్తి సమాచారం కొరకు ఏడుళ్ల బయ్యారం ఎస్ఐ టీవీ.సూరి సెల్ నెంబర్ 9440904283,కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ సెల్ నెంబర్ 9515079266 నెంబర్లను సంప్రదించాలని వారు కోరారు.

Share it:

TS

Post A Comment: